Updated : 23/12/2022 09:02 IST

పీసీఓఎస్‌ నుంచి ఉపశమనం..

జీవనశైలి మార్పులూ, ఇతరత్రా కారణాలతో... పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌(పీసీఓఎస్‌) బారిన పడుతోన్న మహిళల సంఖ్య ఎక్కువే. దీనికి పరిష్కారంగా మందులు వాడటం, వ్యాయామం చేయడమే కాదు...ఆహారంలోనూ తగినన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

మెంతులను.. రక్తంలో చక్కెరస్థాయులను అదుపులో ఉంచి ఇన్సులిన్‌ను క్రమం తప్పకుండా చూస్తాయివి. కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. రోజూ పావుకప్పు గోరువెచ్చని నీటిలో చిటికెడు మెంతిపిండి కలిపి తాగితే చాలు.

రాగులు.. గ్లూటెన్‌ ఫ్రీగా పిలిచే రాగుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఈ పిండితో చేసే రోటీ, దోశ, జావ వంటివి రోజూ తినొచ్చు.

పచ్చగా.. ముదురాకుపచ్చని ఆకుకూరల్లో పీచు ఎక్కువగా, కెలోరీలు తక్కువగా ఉండటంతో అధికబరువు సమస్య అదుపులో ఉంటుంది. బి విటమిన్‌, ఫోలేట్‌ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్‌ సమన్వయం అవుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది,

అవిసెలు... పీచు, ఒమేగా-3 నిండుగా ఉండే ఈ విత్తనాలు యాండ్రోజన్‌ స్థాయులను తగ్గిస్తాయి. పీసీఓఎస్‌ సమస్యను అదుపులో ఉంచుతాయి.

ఇవే కాదు... చిలగడ దుంపలు, బాదం, గుమ్మడి విత్తనాలు, చిక్కుడు, శనగలు, అవకాడో వంటివాటినీ వారానికి కనీసం రెండు మూడు సార్లైనా తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని