వీపు మీద పొక్కులా..?
మొటిమలంటే ముఖం పైనే వస్తాయనుకుంటాం. కానీ వేడి, హ్యుమిడిటీతో కూడిన ఈ వేసవిలో వీపు పైనా మొటిమలు, కురుపులు వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. ఇందుకు చెమట, జిడ్డుదనమే ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. వీటిని తొలగించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయంటున్నారు.
మొటిమలంటే ముఖం పైనే వస్తాయనుకుంటాం. కానీ వేడి, హ్యుమిడిటీతో కూడిన ఈ వేసవిలో వీపు పైనా మొటిమలు, కురుపులు వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. ఇందుకు చెమట, జిడ్డుదనమే ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. వీటిని తొలగించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయంటున్నారు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..
⚛ బయటి నుంచి ఇంటికొచ్చిన తర్వాత, అలాగే వ్యాయామం పూర్తైన వెంటనే శుభ్రంగా స్నానం చేయడం ముఖ్యం. తద్వారా చెమట ఎప్పటికప్పుడు తొలగిపోయి సమస్య క్రమంగా తగ్గుతుంది. లేదంటే చెమటతో కూడిన దుస్తుల వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
⚛ ఎవరి వీపు వారికి అందదు. దాంతో పైపైన శుభ్రం చేసుకుంటుంటారు. దీనివల్ల అక్కడ చేరిన మురికి, జిడ్డుదనం తొలగిపోక మొటిమలు, కురుపుల సమస్య తలెత్తుతుంది. కాబట్టి తరచూ వీపును స్క్రబ్ చేసుకోవడం మంచిది. ఇందుకోసం ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన స్క్రబ్స్‌ని ఉపయోగించచ్చు.. లేదంటే బయట దొరికే సెలిసిలిక్ ఆమ్లంతో కూడిన స్క్రబ్స్‌ని నిపుణుల సలహా మేరకు వాడచ్చు.
⚛ టీట్రీ ఆయిల్ ఎన్నో చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఈ నూనెతో తరచూ వీపును మర్దన చేసుకోవడం మంచిది. అలాగే టీట్రీ ఆయిల్ వాడి తయారుచేసిన లోషన్లు, క్లెన్సర్లు, క్రీమ్స్ ఉపయోగించినా ఫలితం ఉంటుంది.
⚛ సన్‌స్క్రీన్ వీపుకీ అవసరమే. ఎందుకంటే చెమట, దుమ్ము కారణంగా మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకునేందుకు ఇది సహాయపడుతుంది. ఫలితంగా అక్కడి చర్మ కణాలు శుభ్రపడి మొటిమల సమస్య వేధించదు. అయితే నూనె పదార్థం వాడని సన్‌స్క్రీన్ లోషన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.
⚛ బిగుతుగా ఉండే దుస్తులు కూడా అధిక చెమటకు, తద్వారా వీపుపై మొటిమల సమస్యకు కారణమవుతుంటాయి. కాబట్టి వదులుగా ఉండే కాటన్ దుస్తుల్ని ఎంచుకోవడం మంచిది.
⚛ వీపుపై మొటిమల సమస్యకు చెక్ పెట్టడానికి గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అధికంగా ఉండే ఆహార పదార్థాలు కారణమవుతుంటాయి. కాబట్టి GI తక్కువగా ఉండే కాయగూరలు, పండ్లు, తృణధాన్యాలు.. వంటివి ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది.
⚛ జుట్టును వదిలేయడం ఈ తరం అమ్మాయిల హెయిర్‌స్టైల్. అయితే దీనివల్ల కూడా వీపుపై మొటిమలొచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. జుట్టులోని నూనెలే ఇందుకు కారణమట! కాబట్టి కురులు విరబోసుకోకుండా పోనీ టెయిల్ వేసుకోవడం, ముఖ్యంగా నూనె పెట్టుకున్న సమయాల్లో బన్ హెయిర్‌స్టైల్ వేసుకోవడం మంచిది.
⚛ ఒత్తిడి, ఆందోళనల వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది చర్మంపై మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి యోగా, ధ్యానం.. వంటి వ్యాయామాలు తప్పనిసరి.
ఇవన్నీ పాటించినా సమస్య తగ్గకపోతే మాత్రం.. ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించడం మంచిది. వాళ్లు సూచించే మందులు, క్రీములతో సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పాదాలు పదిలంగా
- స్లిట్... మరింత స్టైల్‌గా!
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
ఆరోగ్యమస్తు
- కోపాన్ని తగ్గించే శశాంకాసనం!
- పోషకాల ‘పుట్ట’... ఆరోగ్యానికి ‘గొడుగు’
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
అనుబంధం
- మీరైతే ఏం చేస్తారు?
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
యూత్ కార్నర్
- ఒలింపిక్స్ బరిలో... బిహార్ ఎమ్మెల్యే!
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!