Wedding Season: ఆ సమస్యకు చెక్‌ పెట్టాలంటే!

అసలే పెళ్లిళ్ల సీజన్‌.. సాధారణంగానే అందంగా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు ఈ సీజన్‌లో ప్రత్యేకంగా ఈ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తుంటారు.. కానీ చాలామందికి నిద్రలేమి, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ముఖం ఉబ్బిపోవడం ఓ పెద్ద సవాలుగా మారుతుంది. మరి, ఈ సమస్యకు కొన్ని సహజసిద్ధమైన....

Published : 05 Dec 2022 19:30 IST

అసలే పెళ్లిళ్ల సీజన్‌.. సాధారణంగానే అందంగా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు ఈ సీజన్‌లో ప్రత్యేకంగా ఈ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తుంటారు.. కానీ చాలామందికి నిద్రలేమి, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ముఖం ఉబ్బిపోవడం ఓ పెద్ద సవాలుగా మారుతుంది. మరి, ఈ సమస్యకు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలతో చెక్‌ పెట్టచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

సీజన్‌ని బట్టి మార్చే సౌందర్య ఉత్పత్తులు శరీరానికి సరిపడకపోవడం వల్ల వీటి దుష్ప్రభావాలు ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని దూరం పెట్టడం మంచిది. అలాగే కాలాన్ని బట్టి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఈ విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకుంటే మరీ మంచిది. అలాగే వాడే ప్రతి సౌందర్య ఉత్పత్తినీ ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకొని ఆపై ఉపయోగించాలి.

ఆహారంలో ఉప్పు ఎక్కువైనా.. శరీరం నీటిని నిలుపుకొంటుంది. ఫలితంగా ముఖంతో పాటు శరీర భాగాలు కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో టీస్పూన్‌ ఉప్పును మించకుండా చూసుకోవాలి.

ముఖాన్ని రోజూ మర్దన చేసుకోవడం వల్ల ఉబ్బు సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ క్రమంలో జేడ్‌ రోలర్స్‌ చక్కగా ఉపయోగపడతాయి. అలాగే అత్యవసర నూనెలతోనూ ముఖాన్ని మర్దన చేసుకున్నా సమాన ఫలితం ఉంటుంది. అయితే ఈ క్రమంలో కింది నుంచి పైకి, బయటి నుంచి లోపలి వైపుకి మర్దన చేయాల్సి ఉంటుంది.

కార్డియో, బరువులెత్తే వ్యాయామాలు/కొన్ని రకాల ఫేషియల్‌ ఎక్సర్‌సైజులు కూడా ఉబ్బిన ముఖాన్ని సాధారణ స్థితికి తీసుకొస్తాయి. ఈ క్రమంలో శరీరంలో రక్తప్రసరణ మెరుగై చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి. తద్వారా చర్మంలోని మలినాలు, ఇతర వ్యర్థాలు తొలగిపోతాయి.

ఉబ్బిన ముఖాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంలో సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్స్‌దీ ప్రధాన పాత్రే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ముల్తానీ మట్టి, రోజ్‌ వాటర్‌తో తయారుచేసిన ఫేస్‌ప్యాక్‌ను తరచూ అప్లై చేసుకోవడం వల్ల సమస్య నుంచి విముక్తి పొందచ్చు.

ఐస్‌ ముక్కలు/చల్లటి నీటితో ముఖంపై మర్దన చేసుకున్నా చక్కటి ఫలితం ఉంటుంది.

కీరా దోస ముక్కల్ని ముఖంపై పరచుకొని కాసేపు సేదదీరడం వల్ల కూడా ముఖంపై వచ్చిన ఉబ్బును తక్షణమే తగ్గించుకోవచ్చు. వీటికి బదులు వాడేసిన గ్రీన్‌ టీ బ్యాగుల్ని సైతం వాడుకోవచ్చు.

నీరు ఎక్కువ తాగినా, డీహైడ్రేషన్‌కి గురైనా శరీరం నీటిని నిలుపుకొంటుంది. కాబట్టి బరువును బట్టి నీటి మోతాదును నిర్ణయించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్