చర్మం జిడ్డుగా ఉంటోందా?

ఏ కాలంలోనైనా కొంతమంది చర్మం జిడ్డుగానే కనిపిస్తుంటుంది. ఇక వేసవిలో అయితే చెప్పే పనే లేదు. ఇలాంటివారు ఎన్ని క్రీములు రాసుకున్నా సరే.. ముఖంపై జిడ్డు పేరుకుని.. అలంకరణ చేసుకున్న కొద్దిసేపటికే ముఖం మళ్లీ నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది.

Published : 15 Mar 2024 14:09 IST

ఏ కాలంలోనైనా కొంతమంది చర్మం జిడ్డుగానే కనిపిస్తుంటుంది. ఇక వేసవిలో అయితే చెప్పే పనే లేదు. ఇలాంటివారు ఎన్ని క్రీములు రాసుకున్నా సరే.. ముఖంపై జిడ్డు పేరుకుని.. అలంకరణ చేసుకున్న కొద్దిసేపటికే ముఖం మళ్లీ నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది.

పసుపు..

దీనిలో యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి జిడ్డుదనాన్ని దూరం చేస్తాయి. ప్రతిరోజూ రాత్రిపూట చెంచా పసుపులో కొన్ని పాలు పోసి.. మెత్తటి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది.

వంటసోడా..

చెంచా నిమ్మరసంలో అరచెంచా బేకింగ్‌ సోడా కలపాలి. మొటిమలు ఉన్న చోట.. ఈ మిశ్రమాన్ని పూతలా వేయాలి. కాసేపయ్యాక తడి చేత్తో మర్దన చేసి ఆ పూతను తొలగించాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. నూనె గ్రంథులు మూసుకుపోతాయి. జిడ్డు సమస్య తగ్గుతుంది.

ఉప్పు..

స్ప్రే సీసాలో నీళ్లు తీసుకుని అందులో చెంచా ఉప్పు వేయాలి. ముఖం మీద ఆ నీటిని తరచూ స్ప్రే చేసుకుంటూ తుడుచుకోవాలి. కళ్లపై మాత్రం ఆ స్ప్రే పడకుండా చూసుకోవాలి. ఈ నీళ్ల వల్ల జిడ్డు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

నిమ్మరసం..

జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి నిమ్మరసం చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసంలో కాసిన్ని నీళ్లు కలిపి అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. కాసేపు ఆ ఉండల్ని ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత బయటికి తీసి వాటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోయి శుభ్రపడుతుంది. తేమ అందుతుంది.. జిడ్డు కూడా పేరుకోకుండా ఉంటుంది.

టమాటో..

విటమిన్‌ సి, సిట్రిక్‌ యాసిడ్‌ అధికంగా లభించే వాటిల్లో టమాటో ఒకటి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారు టమాటో ముక్కతో ముఖంపై మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది. జిడ్డు తొలగిపోతుంది.

మొక్కజొన్న పిండి..

ముఖం కడుక్కున్న వెంటనే మొక్కజొన్న పిండిలో.. నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ పిండి అదనంగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. ఈ పూత వేసుకున్నాక మేకప్‌ వేసుకున్నా ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్