ఆందోళనలకు దూరంగా...

జీవితం అన్నాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరమైన కష్టనష్టాలు ఏవో ఎదురౌతూనే ఉంటాయి. వాటి గురించి తీవ్రంగా ఆలోచించిన కొద్దీ దిగులూ, దుఃఖం ముంచుకొస్తాయి.

Updated : 25 Mar 2023 16:55 IST

జీవితం అన్నాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరమైన కష్టనష్టాలు ఏవో ఎదురౌతూనే ఉంటాయి. వాటి గురించి తీవ్రంగా ఆలోచించిన కొద్దీ దిగులూ, దుఃఖం ముంచుకొస్తాయి. ఆయా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవడం ఎటూ తప్పదు. ఆలోపు ఆవేశం, ఆందోళన ఉక్కిరిబిక్కిరి చేయకుండా ఉండాలంటే మెడిటేషన్‌ లేదా ధ్యానం తప్పనిసరి. ఈ సహజ ధ్యానం అంటే ఏమిటో, దానివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూడండి...

ఎలా చేయాలి...

సహజ ధ్యానం చేసేందుకు సౌకర్యంగా ఉండే భంగిమలో కూర్చోవాలి. బొటనవేలు, చూపుడు వేళ్ల చివరలు కలిపి మిగిలిన మూడు వేళ్లను నిటారుగా ఉంచి చేతులను మోకాళ్ల మీద ఉంచాలి. కళ్లు మూసుకుని అంతరంగం మీద ధ్యాస పెట్టాలి. ఈ చిన్ముద్ర మనలో ఆధ్యాత్మిక శక్తి బయటకు ప్రసరించకుండా ఆపుతుంది. మనసులో మెదిలే ఆలోచనలను గమనించాలి. మంచి చెడు దేనికీ ప్రతిస్పందించకుండా నిర్వికారంగా ఉండాలి. ధ్యానం చేసినంతసేపూ శ్వాస మీదే ధ్యాస నిలపాలి. ఇలా రోజూ ఒక ఐదు నిమిషాలు చేయండి. ఇదెంతో సులువు. కేవలం కళ్లు మూసుకుని మీ మనసు ఏం చేస్తోంది.. మీ ఆలోచనలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి.. మీలో ఎలాంటి సంవేదనలు కలుగుతున్నాయి.. వీటిని గమనించడమే మీ పని. ఈ ముద్రలో ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి. ఇది ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు.

ఇవీ లాభాలు...

* రోజులో ఒక ఐదు నిమిషాలు సహజ ధ్యానం చేయగలిగితే ఒత్తిడి తగ్గుతుంది.  

* ఎలాంటి భయాలూ, ఆందోళనలూ చుట్టుముట్టవు. శారీరకంగా, మానసికంగా సేదతీరి, ప్రశాంతత అనుభూతికొస్తుంది.

* ఈ ఇన్నర్‌ జర్నీతో మనమేంటి, ఏం చేయాలి- అనేది తెలుస్తుంది. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్