రోజూ మస్కారా వాడుతున్నారా?

వంపులు తిరిగిన కనురెప్పలు అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే వాటికి మస్కారాతో సొబగులద్దడం మనకు అలవాటే! అయితే వృత్తిలో భాగంగానే కావచ్చు.. లేదంటే మేకప్‌ వేసుకోవాలన్న కోరికతో కావచ్చు.. కొంతమంది అమ్మాయిలు రోజూ మస్కారా అప్లై చేసుకుంటారు.

Published : 26 Nov 2023 12:22 IST

వంపులు తిరిగిన కనురెప్పలు అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే వాటికి మస్కారాతో సొబగులద్దడం మనకు అలవాటే! అయితే వృత్తిలో భాగంగానే కావచ్చు.. లేదంటే మేకప్‌ వేసుకోవాలన్న కోరికతో కావచ్చు.. కొంతమంది అమ్మాయిలు రోజూ మస్కారా అప్లై చేసుకుంటారు. మరికొందరు మేకప్‌ వేసుకున్నా వేసుకోకపోయినా మస్కారాను మర్చిపోరు. ఏదేమైనా ఇలా రోజూ మస్కారాను ఉపయోగించడం వల్ల అందం మాటేమో గానీ పలు దుష్ప్రభావాలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే అకేషనల్‌గా వాడడం మంచిదంటున్నారు. ఒకవేళ రోజూ తప్పనిసరిగా పెట్టుకోవాల్సి వస్తే మాత్రం ఈ చిట్కాలు పాటించమంటున్నారు.

తేమనందించండి!

కనురెప్పలు చాలా సున్నితంగా ఉంటాయి. అలాంటి వాటికి రోజూ మస్కారా అప్లై చేస్తే వాటిలోని రసాయనాలు కనురెప్పల వెంట్రుకలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా అవి తేమను కోల్పోయి పొడిబారిపోతాయి. అలా జరగకూడదంటే మస్కారా పెట్టుకునే ముందు కనురెప్పల్ని మాయిశ్చరైజ్‌ చేయమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పెట్రోలియం జెల్లీ, జొజోబా నూనె, కొబ్బరి నూనె.. వంటివి రెప్పలకు అప్లై చేసి ఆ తర్వాత మస్కారా పెట్టుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురుకాకుండా ఉంటాయి.. అలాగే రెప్పలు తేమను కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు. అయితే బాడీ లోషన్‌ వంటివి రెప్పలకు వాడకూడదన్న విషయం గుర్తుపెట్టుకోండి.

నాణ్యత ముఖ్యం!

తక్కువ ధరకు దొరుకుతుంది కదా అని ఏది పడితే అది కనురెప్పలకు అప్లై చేస్తే లేనిపోని కంటి సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లవుతుంది. అందుకే మంచి బ్రాండ్‌, నాణ్యత ఉన్న, కంటి పరంగా పరీక్షించి ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తేల్చిన వాటర్‌ప్రూఫ్‌ మస్కారాను ఎంచుకోవడం మంచిది. ఈ విషయం లేబుల్‌ని చూసి తెలుసుకోవచ్చు.. లేదంటే నిపుణుల సలహా తీసుకోవచ్చు.

రుద్దకండి!

మస్కారా పెట్టుకోవడమే కాదు.. తొలగించే క్రమంలోనూ జాగ్రత్త వహించాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం మిసెల్లార్‌ వాటర్‌/మేకప్‌ రిమూవర్‌ని ఉపయోగించచ్చు. దీన్ని కాటన్‌ బాల్‌పై వేసి.. కనురెప్పలపై అద్దాలి.. ఈ క్రమంలో కళ్లు మూసుకోవడం మర్చిపోవద్దు.. లేదంటే మస్కారా కళ్ల లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత కాటన్‌ ప్యాడ్‌తో నెమ్మదిగా తుడిచేస్తే సరిపోతుంది. అలాకాకుండా తొలగించే క్రమంలో బలంగా రుద్దడం వల్ల కనురెప్పల వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్