మండే ఎండల్లో.. ఈ సమస్యలు లేకుండా..!

మండే ఎండల్లో ఉక్కపోతగా అనిపించడం, చెమటలు ఎక్కువగా పడుతూ ఉండడం, చర్మం కాస్త బంకగా అనిపించడం.. వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నుంచే కొన్ని చిట్కాలు పాటించడం చాలా మంచిది.

Published : 03 May 2024 12:25 IST

మండే ఎండల్లో ఉక్కపోతగా అనిపించడం, చెమటలు ఎక్కువగా పడుతూ ఉండడం, చర్మం కాస్త బంకగా అనిపించడం.. వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నుంచే కొన్ని చిట్కాలు పాటించడం చాలా మంచిది.

క్లెన్సింగ్..

వేసవిలో ఉండే విపరీతమైన వేడి కారణంగా చెమట భరించలేక తరచూ మొహం కడుక్కోవడం మామూలే. కానీ తేమ అధికంగా ఉండే ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత తక్కువగా ఫేస్‌వాష్ చేసుకోవాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖం కడుక్కున్నప్పుడు చర్మం పైపొరల్లో ఉండే సహజసిద్ధమైన నూనెలు సైతం నీటితో పాటు తొలగిపోవడంతో చర్మం పూర్తిగా పొడిబారిపోయినట్లు కనిపించడమే ఇందుకు కారణం. ఈ సమస్య నుంచి బయటపడి చర్మాన్ని శుభ్రం చేసుకునేందుకు వారానికి రెండుసార్ల చొప్పున క్రమం తప్పకుండా క్లెన్సింగ్ ప్రక్రియను అవలంబించడం చాలా ఉత్తమమట! దీనికోసం ఉపయోగించే ఉత్పత్తులు రసాయనాలు కలిగినవి కాకుండా సహజసిద్ధమైనవైతే మరీ మంచిదని అంటున్నారు నిపుణులు.

చర్మాన్ని పొడిగా ఉంచండి..

బాగా ఉక్కపోతగా ఉన్నప్పుడు- మెడ, చెవి వెనుక భాగం, ఛాతీ, చంకలు, మోకాళ్లు, మోచేతులు, పాదాలు, వేళ్ల మధ్య.. ఇలా కొన్ని ప్రదేశాల్లో చెమట ఎక్కువగా పడుతుంటుంది. అయితే ఆయా ప్రదేశాల్లో ఎక్కువ సమయం చెమట అలా నిలిచి ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో యాంటీ ఫంగల్ సబ్బు ఉపయోగించి స్నానం చేయాలి. ఫలితంగా దుమ్ము, ధూళితో పాటు చర్మ సంబంధిత సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియా సైతం సులభంగా తొలగిపోతుంది.

తరచూ తలస్నానం వద్దు..!

కాస్త చిరాకుగా అనిపిస్తే చాలు.. చాలామంది మొదటగా చేసే పని తలస్నానం. ఇది మంచిదే అయినప్పటికీ తరచూ ఇలా చేయడం కూడా సౌందర్యపరంగా నష్టం వాటిల్లేలా చేస్తుంది. ముఖ్యంగా కుదుళ్ల వద్ద ఉండే సహజసిద్ధమైన నూనెలు కోల్పోవడం వల్ల జుట్టు పొడిబారి కళావిహీనంగా కనిపిస్తుంది. అలాగే జుట్టు రాలిపోయే సమస్య కూడా ఎక్కువవుతుంది. కాబట్టి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కేశాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారానికి రెండుసార్లు షాంపూ చేసుకోవడం ద్వారా కేశాలను శుభ్రంగా ఉంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్