మెడ చుట్టూ నల్లబడుతోందా?

మెడ చుట్టూ నల్లబడడం.. ముడతలు పడడం.. వయసు పైబడిన తర్వాత చాలామంది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య ఇది. వయసుతో పాటు వూబకాయం, హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం వంటివి కూడా ఇందుకు కారణమవుతాయి. అయితే మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామాలతో.....

Updated : 28 Oct 2022 20:20 IST

మెడ చుట్టూ నల్లబడడం.. ముడతలు పడడం.. వయసు పైబడిన తర్వాత చాలామంది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య ఇది. వయసుతో పాటు వూబకాయం, హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం వంటివి కూడా ఇందుకు కారణమవుతాయి. అయితే మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామాలతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యను నివారించవచ్చంటున్నారు నిపుణులు.

మాయిశ్చరైజర్

చర్మ సంరక్షణలో మాయిశ్చరైజర్ చాలా ముఖ్యమైనది. క్రమం తప్పకుండా మెడకు మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మం పొడిబారి పొలుసులుగా మారకుండా ఉంటుంది. పల్చగా ఉండడం వల్ల మెడ చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కొలాజెన్ క్రీములు, మాయిశ్చరైజర్లు వాడాలి.

నెక్ మసాజ్

ఆలివ్ లేదా కొబ్బరినూనెలో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి 15 నుంచి 20 నిమిషాల పాటు భుజాల నుంచి ముఖం వైపుకి మసాజ్ చేయాలి. (20 నిమిషాలకు మించి నెక్ మసాజ్ చేయకూడదు.) వారానికొకసారి నెక్ మసాజ్ చేయడం వల్ల నలుపుదనం, ముడతలు తగ్గి చర్మం మెరుపు సంతరించుకుంటుంది.

ఐస్ వాష్

తరచూ ఐస్‌క్యూబ్స్‌తో మసాజ్ చేయడం లేదా చల్లటి నీటితో కడగడం వల్ల, వదులైన చర్మరంధ్రాలు తిరిగి బిగుతుగా తయారవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్