కళ్ల కింద నల్లటి వలయాలు.. తగ్గాలంటే..!
కళ్ల కింద నల్లటి వలయాలు.. చాలామందిని వేధించే సమస్య. పిల్లలు.. పెద్దలు.. అనే తేడా లేకుండా ఏ వయసు వారికైనా ఈ సమస్య ఎదురు కావచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడటం, పదేపదే కాఫీ తాగడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం, పోషకాహార లోపం.. మొదలైనవన్నీ కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలే.
కళ్ల కింద నల్లటి వలయాలు.. చాలామందిని వేధించే సమస్య. పిల్లలు.. పెద్దలు.. అనే తేడా లేకుండా ఏ వయసు వారికైనా ఈ సమస్య ఎదురు కావచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడటం, పదేపదే కాఫీ తాగడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం, పోషకాహార లోపం.. మొదలైనవన్నీ కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలే. మరి వీటిని తగ్గించుకునే మార్గాల్లేవా? అంటే ఉన్నాయి.. అవేంటో చూద్దామా?
చల్లటి టీ బ్యాగ్స్‌తో..
టీ బ్యాగ్స్ నల్లటి వలయాలను పోగొట్టడంలో బాగా సహాయపడతాయి. దీనికోసం పది నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచిన టీ బ్యాగ్స్‌ను కళ్లపై ఉంచుకుని 15 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
టమాటోతో..
టమాటో చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే కంటి కింద వలయాలు తొలగించడంలోనూ దీని పాత్ర కీలకమే. కొంచెం టమాటో రసంలో కాస్త నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. లేదా కేవలం నిమ్మరసాన్ని తీసుకుని రోజుకు రెండుసార్లు కళ్ల కింద అప్త్లె చేసినా ఫలితం ఉంటుంది.
ఉప్పు తక్కువగా..
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఆల్కహాల్.. వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల కంటి కింద నల్లటి వలయాలు తగ్గడం మాత్రమే కాదు.. శరీరానికి విశ్రాంతి కూడా లభిస్తుంది.
కీరా లేదా ఆలుగడ్డ ముక్కలతో..
చల్లటి కీరా లేదా ఆలుగడ్డ ముక్కల్ని తీసుకుని కళ్లపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేసిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసి క్రీం అప్త్లె చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఆలుగడ్డ పొట్టు, రసం కూడా ఈ నల్లటి వలయాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
బాదం నూనెతో..
రోజూ రాత్రి పడుకునే ముందు కాస్త బాదం నూనెను తీసుకుని కళ్ల చుట్టూ అప్త్లె చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి. ఇదే పద్ధతి రోజ్ వాటర్‌తో చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.
కంటిని నలపకూడదు..
కొంతమంది కళ్లను పదేపదే నలుపుతుంటారు. దీనివల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కంటిని నలపడం ద్వారా మనంతట మనమే ఈ సమస్యను కొని తెచ్చుకున్నట్లవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పాదాలు పదిలంగా
- స్లిట్... మరింత స్టైల్‌గా!
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
ఆరోగ్యమస్తు
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- కోపాన్ని తగ్గించే శశాంకాసనం!
- పోషకాల ‘పుట్ట’... ఆరోగ్యానికి ‘గొడుగు’
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
అనుబంధం
- నా ఉత్తరాలు చూసి.. కన్నీళ్లతో హత్తుకున్నారు.. తీరు మార్చుకున్నారు!
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
యూత్ కార్నర్
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- ఒలింపిక్స్ బరిలో... బిహార్ ఎమ్మెల్యే!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
'స్వీట్' హోం
- ఏడిపిస్తోంటే... ప్రేమంటున్నారు!
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!