మెడ, పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే..

హలో మేడం.. నా వయసు 24 సం||. నా మెడ, పెదవుల చుట్టూ నల్లగా ఉంటుంది. నీళ్లలో బేకింగ్ సోడా కలిపి రాస్తే ఫలితం ఉంటుంది అని ఎక్కడో చదివాను. అది ఎంతవరకు నిజం? ఇంట్లో లభ్యమయ్యే వస్తువులతో మెడ నలుపు తగ్గుతుందా.....

Published : 26 Jan 2023 14:29 IST

హలో మేడం.. నా వయసు 24 సం||. నా మెడ, పెదవుల చుట్టూ నల్లగా ఉంటుంది. నీళ్లలో బేకింగ్ సోడా కలిపి రాస్తే ఫలితం ఉంటుంది అని ఎక్కడో చదివాను. అది ఎంతవరకు నిజం? ఇంట్లో లభ్యమయ్యే వస్తువులతో మెడ నలుపు తగ్గుతుందా? ఏవైనా చిట్కాలు చెప్పగలరు. - ఓ సోదరి

జ. మీ చర్మతత్వం ఏమిటి అనేది మీరు ప్రస్తావించలేదు. మీది ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయితే బేకింగ్ సోడా ఉపయోగించడం వల్ల చర్మంపై బొబ్బలు, ర్యాషెస్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బేకింగ్ సోడాను ఉపయోగించడానికి బదులుగా ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలను ఉపయోగించే సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.

మెడ చుట్టూ నలుపు తగ్గడానికి..

కావాల్సినవి:

కలబంద గుజ్జు- 1 టేబుల్ స్పూన్

దానిమ్మ గింజల రసం- 1 టేబుల్ స్పూన్

నిమ్మరసం- 6 నుంచి 10 చుక్కలు

ఈ మూడింటినీ బాగా మిక్స్ చేసి మెడ చుట్టూ ఈ మిశ్రమంతో పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ క్రమం తప్పకుండా నెల రోజుల పాటు చేయడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఒకవేళ ఇలా మసాజ్ చేసుకునే సమయం లేకపోతే ఈ మిశ్రమంలో అరచెంచా బార్లీ/ బాదం పౌడర్ వేసి బాగా కలుపుకొని మెడ చుట్టూ ప్యాక్‌లా వేసుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 45 రోజుల పాటు చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.

పెదవుల చుట్టూ నలుపు తగ్గడానికి..

కావాల్సినవి:

కీరాదోస గుజ్జు (తొక్క తీసి, మిక్సీ వేసుకోవాలి)- 2 చెంచాలు

శెనగపిండి- చెంచా

ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి పెదవుల చుట్టూ ప్యాక్‌లా వేసుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈవిధంగా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఒకవేళ కీరా అందుబాటులో లేకపోతే ఈ ప్యాక్‌లో యాపిల్ లేదా పచ్చిబంగాళాదుంప గుజ్జుని కూడా ఉపయోగించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్