రక్తహీనతను నివారించాలంటే..

శరీరంలో హెమోగ్లోబిన్ శాతం తగినంత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే మన శరీరంలో ఐరన్ తగ్గి రక్తహీనతతో బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో అయితే ప్రతి నెలా నెలసరి సమయంలో ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి శరీరంలో రక్తకణాలు....

Published : 06 Dec 2022 13:08 IST

శరీరంలో హెమోగ్లోబిన్ శాతం తగినంత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే మన శరీరంలో ఐరన్ తగ్గి రక్తహీనతతో బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో అయితే ప్రతి నెలా నెలసరి సమయంలో ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి శరీరంలో రక్తకణాలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. మరి దీనికోసం ఏం చేయాలి?

బీట్‌రూట్, క్యారట్ మన శరీరంలో రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో ఐరన్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ఇది మన శరీరంలో రక్తకణాలను పెంచుతుంది.

గర్భిణులు వీట్ బ్రెడ్‌తో పాటు తృణధాన్యాలు, ఓట్‌మీల్‌ను ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది.

ఎనీమియాతో బాధపడుతున్న వారు ఆకుపచ్చగా, తాజాగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఎందుకంటే వీటిలో ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించే పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. శరీరంలో హెమోగ్లోబిన్ శాతం కూడా ఎక్కువవుతుంది. అలాగే యాపిల్స్, ద్రాక్ష, పుచ్చకాయ, ఎండు ద్రాక్ష.. మొదలైన పండ్లు తినడం వల్ల హెమోగ్లోబిన్ పెరుగుతుంది.

గుడ్డులో ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది.

చికెన్, మటన్, చేపలు.. మొదలైన వాటిల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది. కాబట్టి వీటివల్ల రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయులు రెట్టింపవుతాయి. కానీ మాంసాహారం మరీ ఎక్కువగా తినకపోవడం మంచిది. శరీరంలో రక్తం పెరుగుతుంది కదా అని మోతాదుకు మించి తిన్నట్లయితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు రోజూ తినాలనుకుంటే మాత్రం కొవ్వు తక్కువగా ఉండే మాంసాహారం తీసుకోవడం మంచిది.

అలాగే కొద్ది మొత్తంలో ఐరన్ లభించే గింజ ధాన్యాలనూ ఆహారంలో భాగం చేసుకోవాలి.

శరీరంలో రక్తం పెరగాలంటే ఐరన్ ఎక్కువగా లభించే బాదం తినడం చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పట్నుంచైనా వీటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

ఆకుకూరలు, క్యాబేజి, క్యాలీఫ్లవర్, చిలగడదుంప.. మొదలైనవన్నీ హెమోగ్లోబిన్ శాతం పెరగడంలో సహాయపడతాయి.

మనం తినే ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించాలంటే విటమిన్ సి ఎక్కువగా లభించే ఆహారం, పానీయాలు తీసుకోవాలి. ఉదాహరణకి ఆరెంజ్ జ్యూస్.. ఇది ఆహారంలోని ఐరన్, దాని సప్లిమెంట్స్‌ను శరీరం గ్రహించేందుకు తోడ్పడుతుంది.

మరో ముఖ్యమైన విషయమేంటంటే.. ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్ధకం.. వంటి సమస్యలేవైనా ఎదురైతే ఐరన్‌ను చాలా నెమ్మదిగా శరీరంలోకి విడుదల చేసే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్