బరువు తగ్గాలా.. వీటినీ చేర్చండి!

డైట్‌.. బరువు తగ్గాలనుకునే అమ్మాయిల ప్రధాన మంత్రం. అయితే శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూ కసరత్తులూ చేస్తేనే అనుకున్న లక్ష్యం సాధ్యమవుతుంది.

Updated : 08 Feb 2023 14:54 IST

డైట్‌.. బరువు తగ్గాలనుకునే అమ్మాయిల ప్రధాన మంత్రం. అయితే శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూ కసరత్తులూ చేస్తేనే అనుకున్న లక్ష్యం సాధ్యమవుతుంది. వీటికితోడు ఈ పానీయాలనూ జోడించుకోమంటున్నారు నిపుణులు.

* హెర్బల్‌ టీ.. అల్లం, ఇతర హెర్బ్స్‌ ఉన్న టీని ఉదయాన్నే తీసుకోండి. ఇవి మెటబాలిజంను మెరుగుపరుస్తూనే మలినాలను బయటకు పంపిస్తాయి. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి, కడుపుబ్బరం వంటివి రాకుండా చేస్తాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూనే ఆకలినీ అదుపు చేయగలవు.

* పసుపు నీళ్లు.. గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూను పసుపు, చెంచా తేనె వేసుకొని తాగండి. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. తేనె చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచీ కాపాడుతుంది.

* నెయ్యి.. ఆయుర్వేదంలో దీనికి అధిక ప్రాధాన్యం. గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా నెయ్యి కలిపి పరగడపున తాగండి. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్టరాల్‌ని తగ్గిస్తాయి. నెయ్యిలోని విటమిన్లు, మినరల్స్‌ జీవక్రియల్ని మెరుగుపరుస్తాయి. చాలాసేపు ఆకలి కానివ్వవు. కాబట్టి, ఎక్కువ కెలోరీలు తీసుకుంటామన్న బెంగా ఉండదు.

* ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌.. గ్లాసు గోరువెచ్చని నీటికి అరచెక్క నిమ్మ రసం, రెండు స్పూన్ల ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌, చెంచా తేనె కలిపి తీసుకోండి. ఈ వెనిగర్‌లోని ఎసిటిక్‌ యాసిడ్‌ శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించి, తీపి పదార్థాలపై మనసు మళ్లకుండా చూస్తుంది. నిమ్మలోని విటమిన్‌ సి సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. శరీరంలోని వ్యర్థాలనూ బయటకు పంపేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్