బరువు తగ్గాలంటే..

బరువు తగ్గడానికి రోజూ చేసే వ్యాయామాలతో పాటు మన జీవన శైలికి సంబంధించిన కొన్ని అలవాట్లు, చిన్న చిన్న పనులు కూడా ఎంతగానో తోడ్పడతాయి. ఇవి అలాంటివే.....

Published : 21 Dec 2022 20:34 IST

బరువు తగ్గడానికి రోజూ చేసే వ్యాయామాలతో పాటు మన జీవన శైలికి సంబంధించిన కొన్ని అలవాట్లు, చిన్న చిన్న పనులు కూడా ఎంతగానో తోడ్పడతాయి. ఇవి అలాంటివే..

రాత్రి పూట తీసుకునే భోజనం ఎంత మితంగా ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో సలాడ్స్, పండ్లు.. వంటివి తీసుకోవడం మంచిది. అలాగే రాత్రి తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవడం.. వంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ఉత్తమం.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని తీసుకోవడం రోజూ అలవాటుగా మార్చుకోవాలి. 

రాత్రి భోజనం పూర్తయిన కాసేపటి తర్వాత కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు నడవడం చాలా మంచిది.

సాధారణంగా వ్యాయామం చేసిన తర్వాత శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి కొన్ని రకాల పానీయాలు తీసుకుంటుంటారు. అందులో ప్రొటీన్ షేక్స్ కూడా ఉంటాయి. కానీ సాయంత్రం ఎక్సర్‌సైజ్ చేసిన వారు మాత్రం వీటిని తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రొటీన్లు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. శరీరానికి శక్తిని అందించడానికి వీటికి బదులుగా పండ్లు, పండ్ల రసాలు, స్మూతీస్, మిల్క్‌షేక్స్.. వంటివేవైనా తీసుకోవచ్చు.

షవర్ చేస్తున్నారా?

కొన్ని సందర్భాలలో నిద్రలేమి కూడా కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చంటున్నారు నిపుణులు. అందుకే ఈ సమస్యను వీలైనంత త్వరగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఒత్తిడి, అలసట.. వంటివి తరిమికొట్టడానికి మాత్రమే కాదు.. నిద్రలేమి నుంచి విముక్తి కలిగించడానికి కూడా షవర్ బాత్ చాలానే ఉపయోగపడుతుంది. కాబట్టి సాయంత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శారీరక అలసట తగ్గి ప్రశాంతత సొంతమవుతుంది. ఫలితంగా రాత్రుళ్లు నిద్ర కూడా చక్కగా పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్