పంటి నొప్పికి ఎలాంటి చికిత్స అవసరం?

నా వయసు 35. గత కొన్ని రోజులుగా పంటి నొప్పి వేధిస్తోంది. రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేసుకుంటాను. ప్రతిరోజూ ఉదయం ఉప్పు నీటితో పుక్కిలిస్తాను. అయినా కూడా పంటి నొప్పి వస్తోంది? ఎందుకిలా? దీన్నుంచి ఉపశమనం పొందాలంటే ఎలాంటి చికిత్స తీసుకోవాలి? - ఓ సోదరి

Published : 29 Apr 2024 20:35 IST

నా వయసు 35. గత కొన్ని రోజులుగా పంటి నొప్పి వేధిస్తోంది. రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేసుకుంటాను. ప్రతిరోజూ ఉదయం ఉప్పు నీటితో పుక్కిలిస్తాను. అయినా కూడా పంటి నొప్పి వస్తోంది? ఎందుకిలా? దీన్నుంచి ఉపశమనం పొందాలంటే ఎలాంటి చికిత్స తీసుకోవాలి? - ఓ సోదరి

జ. మీరు రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేసుకుంటున్నానని అంటున్నారు. అలాగే రోజూ ఉప్పు నీటితో పుక్కిలిస్తాననీ చెబుతున్నారు. ఇది చాలా మంచి పద్ధతి. అయినా పంటి నొప్పి వచ్చిందంటే.. పళ్లల్లో పుచ్చులు ఏర్పడి ఉండచ్చు. అయితే ఆ పుచ్చు ఎనామిల్‌ పొర దాటి.. డెంటిన్‌లోకి వ్యాప్తి చెందినప్పుడు పంటిలో కాస్త సున్నితత్వం ఏర్పడుతుంది. ఒకవేళ అదే పుచ్చు పంటి నరానికి తాకినప్పుడు నొప్పి వస్తుంది. మీకు పంటి నొప్పి ఉందంటున్నారు.. కాబట్టి అది పుచ్చు మూలంగా వచ్చి ఉండచ్చు. ఇలాంటప్పుడు రూట్‌ కెనాల్‌ పద్ధతి ద్వారా దెబ్బతిన్న నరాలను పూర్తిగా తీసేస్తారు. వాటి ప్రదేశంలో కృత్రిమ మెటీరియల్‌తో ఫిల్లింగ్‌ చేస్తారు. ఆ తర్వాత కృత్రిమ పంటి తొడుగును అమర్చి పంటిని తొలగించకుండా రక్షిస్తారు.

మీరు చెప్పిన మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో.. వాటిని కొనసాగించే ప్రయత్నం చేయండి. వీటికి తోడు డెంటల్‌ ఫ్లాసింగ్‌ కూడా చేసుకోవడం మంచిది. ఈ క్రమంలో టూత్‌పిక్‌ ద్వారా దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవచ్చు. ఫలితంగా దంతాల మధ్య పుచ్చులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే మీకు వచ్చిన నొప్పి గురించి కచ్చితంగా నిర్ధరించుకోవాలంటే ఒకసారి దంత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. వారు పరీక్షించి మీ సమస్యకు తగిన చికిత్స అందిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్