WPL: ఉత్కంఠభరితంగా ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్.. ఇది మన అమ్మాయిల టైమ్‌..!

ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడే క్రీడ అనుకునేవారు. కానీ కాలం మారింది. మహిళలు పురుషులతో సమానంగా ఇందులో రాణిస్తున్నారు. మన అమ్మాయిలు ఆడే మ్యాచులకు కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే - భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).....

Updated : 14 Feb 2023 12:34 IST

(Photos: Twitter)

ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడే క్రీడ అనుకునేవారు. కానీ కాలం మారింది. మహిళలు పురుషులతో సమానంగా ఇందులో రాణిస్తున్నారు. మన అమ్మాయిలు ఆడే మ్యాచులకు కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే - భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొన్ని నెలల క్రితం పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు ఇవ్వడం ప్రారంభించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాదిరిగా మహిళలకు కూడా ఒక లీగ్ ఉండాలని భావించింది. ఇందుకోసం ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL)ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన ఆరంభ ప్రీమియర్ లీగ్ వేలం ఈరోజు జరిగింది.

ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటే..

సాధారణంగా క్రీడాకారులు వారి వారి దేశాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంటారు. కానీ, ప్రీమియర్‌ లీగ్‌లలో ఇలా ఉండదు. ఇక్కడ దేశాల స్థానంలో ప్రాంఛైజీలు ఫ్రాంచైజీలు ఉంటాయి. ఇవి మన దేశంతో పాటు ఇతర దేశాల్లోని క్రీడాకారులను వేలం వేసి తమ జట్టులోకి తీసుకుంటాయి. ఇలా మొదలైన పురుషుల ఐపీఎల్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. మహిళలకు కూడా ఇలాంటి లీగ్‌ ఉండాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్ (WPL)ను రూపొందించింది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు ఉంటాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్న దిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇందులో కూడా భాగం కానున్నాయి. వీటికి తోడు యూపీ వారియర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు కొత్తగా చేరాయి. ప్రతి జట్టులో 15 నుంచి 18 మంది క్రీడాకారిణులు ఉంటారు. అలాగే ప్రతి జట్టులో ఆరుగురు విదేశీ క్రీడాకారిణులు ఉంటారు.

ఎప్పుడు? ఎన్ని మ్యాచ్‌లు?..

ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ప్రస్తుతం మహిళల టీ20 ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికాలో జరుగుతోంది. ఇది ముగిసిన తర్వాత మార్చి 4న లీగ్‌ ప్రారంభమవుతుంది. మొత్తం 23 రోజుల పాటు ఈ లీగ్‌ సాగుతుంది. ఇందులో ప్రతి జట్టు మిగిలిన నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ రౌండ్‌ రాబిన్ పద్ధతిలో జరుగుతాయి. లీగ్‌లో మొదటి స్థానం దక్కించుకున్న జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మార్చి 26న జరుగుతుంది.

టాప్‌ 5 వీరే..!

ఈ వేలంలో భారత ఓపెనింగ్‌ బ్యాట్స్ఉమన్‌ స్మృతి మంధానకు అత్యధిక ధర లభించింది. ఆమెను బెంగళూరు జట్టు 3.4 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆష్లీ గార్డనర్‌ను గుజరాత్‌ జెయింట్స్‌ 3.2 కోట్లకు దక్కించుకోగా.. అదే ధరకు ఇంగ్లాండ్ బ్యాటర్ నటాలీ స్కివర్‌ను ముంబయి జట్టు సొంతం చేసుకుంది. వీరి తర్వాత స్థానంలో భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ నిలిచింది. ఆమెను యూపీ వారియర్స్‌ జట్టు 2.6 కోట్లకు సొంతం చేసుకుంది. మరో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను రూ.2.20 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది.

జట్ల వారీగా కొంతమంది క్రీడాకారిణుల వివరాలు...

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు:

స్మృతి మంధాన (3.4 కోట్లు), రిచా ఘోష్‌ (1.9 కోట్లు), ఎలిస్‌ పెర్రీ (1.7 కోట్లు), రేణుకా సింగ్ (1.5 కోట్లు), సోఫీ డివైన్ (50 లక్షలు)

ముంబయి ఇండియన్స్:

పూజా వస్త్రాకర్ (1.9 కోట్లు), హర్మన్ప్రీత్ కౌర్ (1.8 కోట్లు), యాస్తికా భాటియా (1.5 కోట్లు), నటాలీ స్కివర్, అమేలియా కెర్ (కోటి)

గుజరాత్ జెయింట్స్:

ఆష్లీ గార్డనర్, బెత్‌ మూనీ (2 కోట్లు), స్నేహ్ రాణా (75 లక్షలు), అన్నాబెల్‌ సదర్లాండ్ (70 లక్షలు), డియాండ్రా డాటిన్ (60 లక్షలు), సోఫియా డంక్లీ (60 లక్షలు), హర్లీన్‌ డియోల్ (40 లక్షలు)

యూపీ వారియర్స్:

దీప్తి శర్మ (2.6 కోట్లు), ఎక్లెస్టోన్ (1.8 కోట్లు), మెక్‌గ్రాత్ (1.4 కోట్లు), ఇస్మాయిల్ (కోటి), హీలీ (70 లక్షలు), సర్వాణి (55 లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్ (40 లక్షలు), శ్వేతా శర్వాత్ (40 లక్షలు), పర్షవి చోప్రా (10 లక్షలు), ఎస్‌ యశశ్రీ (10 లక్షలు)

దిల్లీ క్యాపిటల్స్:

షెఫాలీ వర్మ (2 కోట్లు), మరిజన్నే కప్‌ (1.5 కోట్లు), జెమీమా రోడ్రిగ్స్, లానింగ్ (1.1 కోట్లు), శిఖా పాండే (60 లక్షలు), రాధా యాదవ్ (40 లక్షలు), టైటాస్‌ సదు (25 లక్షలు)

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్