గర్భసంచి జారకుండా...

కొందరికి గర్భసంచి ఉండాల్సిన చోట ఉండకుండా కిందికి జారుతుంది. నడుము, పొత్తికడుపు కండరాలు బలహీనమవడం లాంటి కారణాలతో అలా జరిగే అవకాశముంది. సేతుబంధాసనం లేదా బ్రిడ్జి పోజ్‌తో ఆ సమస్యను నివారించవచ్చు.

Published : 31 Dec 2022 01:25 IST

కొందరికి గర్భసంచి ఉండాల్సిన చోట ఉండకుండా కిందికి జారుతుంది. నడుము, పొత్తికడుపు కండరాలు బలహీనమవడం లాంటి కారణాలతో అలా జరిగే అవకాశముంది. సేతుబంధాసనం లేదా బ్రిడ్జి పోజ్‌తో ఆ సమస్యను నివారించవచ్చు.

ఎలా చేయాలంటే... ఈ భంగిమ వంతెనను తలపిస్తుంది కనుక సేతుబంధాసనం అన్నారు. వెల్లకిలా పడుకుని చేతులను పక్కనే నిటారుగా జాపి ఉంచాలి. మోకాళ్లను వంచి పాదాలను నేల మీద ఆనించాలి. వెన్ను భాగాన్ని లేపగలిగినంత పైకి లేపాలి. ఇప్పుడు చేతులతో కాలి మడమలను పట్టుకోవాలి. కాళ్లూ, చేతులూ, భుజాల సాయంతో మీ బరువును నిలపండి. నడుమును పైకి లేపే క్రమంలో శ్వాస తీసుకుంటూ పిరుదులను గట్టిగా బిగించాలి. శ్వాసను కొంతసేపు ఆపి ఉంచితే మంచిది. లేదంటే ఆపగలిగినన్ని క్షణాలు ఆపి, ఆనక మెల్లగా వదులుతూ నడుమును కిందికి దించాలి. ఇలా కనీసం ఒక పదిసార్లు చేయాలి.

ప్రయోజనాలు.. గర్భసంచి, పొత్తికడుపు కండరాలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. దీనివల్ల కిందికి జారిన గర్భసంచి కాస్త పైకి జరుగుతుంది. భవిష్యత్తులో కూడా స్థిరంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్