Thailand: థాయిలాండ్‌లో ప్రీస్కూల్‌ వద్ద కాల్పులు: కనీసం 32 మంది మృతి

థాయిలాండ్‌లోని ఓ ప్రీస్కూల్‌ వద్ద ఘోరం చోటు చేసుకొంది. ఓ దుండగుడు ప్రీస్కూల్‌ వద్ద కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం 32 మంది మరణించినట్లు స్థానిక వార్తాపత్రికలు పేర్కొంటున్నారు. మృతుల్లో అత్యధిక మంది చిన్నపిల్లలే.

Updated : 06 Oct 2022 15:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: థాయిలాండ్‌లోని ఓ ప్రీస్కూల్‌ వద్ద ఘోరం చోటు చేసుకొంది. ఓ దుండగుడు ప్రీస్కూల్‌ వద్ద కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం 32 మంది మరణించినట్లు స్థానిక వార్తాపత్రికలు పేర్కొంటున్నాయి. మృతుల్లో అత్యధిక మంది చిన్నపిల్లలే.  ఈ ఘటన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న నాక్లాంగ్‌ జిల్లాలోని నాంగ్‌బు నాలంఫూ ప్రావిన్స్‌లో చోటు చేసుకొంది. కాల్పులకు పాల్పడిన దుండగుడు తప్పించుకోవడంతో పోలీసులు అతడి కోసం వేట మొదలుపెట్టారు. 

నిందితుడిని 34 ఏళ్ల పాన్య ఖమ్రాప్‌గా అనుమానిస్తున్నారు. అతడు మాజీ పోలీసు అధికారి. అతడిని ఏడాది కిందటే విధుల నుంచి తొలగించారు. అప్పట్లో అతడు మాదక ద్రవ్యాలు వాడినట్లు తేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. వాస్తవానికి అతడు శుక్రవారం కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కాల్పులకు పాల్పడిన అనంతరం అతడు బ్యాంకాక్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న 4డోర్‌ వీగో పికప్‌ ట్రక్‌ ఎక్కి పారిపోయాడు. 

సాధారణంగా థాయిలాండ్‌లో భారీ కాల్పుల ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకొంటాయి. చివరి సారిగా 2020లో నఖోమా రాట్చెస్మా నగరంలో ఓ సైనికుడు 21 మందిని కాల్చి చంపడంతోపాటు.. అనేక మంది పౌరులను గాయపర్చాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని