Canada: దూసుకొస్తున్న కార్చిచ్చు.. ఖాళీ అవుతోన్న నగరం..!

Wildfires: ఉత్తర అమెరికాను కార్చిచ్చు అతలాకుతలం చేస్తోంది. తాజాగా కెనడాలో ఇది వేగంగా వ్యాపిస్తోంది.

Updated : 17 Aug 2023 14:54 IST

ఒట్టావా: కార్చిచ్చు కెనడా(canada)ను వణికిస్తోంది. దాని దెబ్బకు ఓ నగరమే ఖాళీ అవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం కల్లా ప్రజలంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

కెనడా(Canada)లోని నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ నగరం వైపు కార్చిచ్చు(wildfires) దూసుకొస్తోంది. వెంటనే ప్రజలంతా ఖాళీ చేయాలంటూ స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ దావానలం పదుల కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ వారాంతంలో ఎల్లోనైఫ్ శివార్లను సమీపిస్తుందని పేర్కొంది. ఆ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ‘మీరు ఇక్కడే ఉండాలనుకుంటే.. మీతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే’ అంటూ అప్రమత్తం చేసింది. 

విమానం గాల్లో ఉండగా.. బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌

ఎల్లోనైఫ్ నగరంలో 20 వేల మంది నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రజలను తరలించేందుకు విమానాలు అందుబాటులో ఉంటాయని ఆ నగర మేయర్ తెలిపారు. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించామన్నారు. ‘ఇది ప్రతిఒక్కరికీ అత్యంత క్లిష్ట సమయం. వీలైనంత వరకు ఒకరికొకరు సాయం చేసుకోండి. మీ వాహనంలో ఖాళీ ఉంటే.. ఇతరులను ఎక్కించుకోండి’ అని కోరారు. అలాగే మూడు వేలమంది జనాభా కలిగిన హే రివర్‌ పట్టణంలో కూడా తరలింపు ప్రక్రియ జరుగుతోంది. బలమైన గాలుల కారణంగా అది వేగంగా వ్యాపిస్తోందని అధికారు వెల్లడించారు. అలాగే పరిసర ప్రాంతాల్లో పొగ అలుముకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 

కొద్దిరోజుల క్రితం హవాయి దీవుల సమూహంలోని లహైనా రిసార్టు నగరంలో దావానలం వ్యాపించింది. గతవారం అది సృష్టించిన విలయానికి 100 మందికిపైగా మృతి చెందారు. వేల సంఖ్యలో నివాసాలు, ఇతర భవనాలు కాలిబూడిదయ్యాయి. వందల సంఖ్యలో జంతువులు మంటల్లో కాలిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని