White House: వైట్‌హౌస్‌ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్‌ మృతి

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

Updated : 05 May 2024 20:20 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ (White House) వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌ బయట గేటును ఓ కారు బలంగా ఢీకొంది. ఆ ఘటనలో వాహన డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందినట్లు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ వెల్లడించింది.

‘రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. కాంప్లెక్స్‌ బయట గేటును బలంగా ఢీకొట్టింది’ అని వైట్‌ హౌస్‌ కార్యాలయం వెల్లడించింది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయం చేసే ప్రయత్నం చేయగా.. డ్రైవర్‌ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారని తెలిపింది.

ఈ ఘటనపై పోలీసులు, స్థానిక యంత్రాంగంతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం వెల్లడించింది. భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పు లేదని పేర్కొంది. ఇదిలా ఉంటే, వైట్‌హౌస్‌ వద్ద ఈ తరహా ఘటన జనవరిలోనూ చోటుచేసుకుంది. ఇదే గేటును ఓ వాహనం ఢీ కొట్టింది. ఇలా కొంతకాలంగా వైట్‌హౌస్‌ వద్ద జరుగుతోన్న చొరబాట్ల నేపథ్యంలో భారీ ఫెన్సింగ్‌ను ఇటీవల ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని