America: అమెరికా శ్రీవారి ఆలయంలో 87 అడుగుల గోపురం

అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో నెలకొన్న అతి పెద్ద హిందూ దేవాలయం ‘శ్రీ వెంకటేశ్వర ఆలయం’లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.

Updated : 29 Oct 2022 08:05 IST

ప్రారంభించిన ఉత్తర కరోలినా గవర్నర్‌

న్యూయార్క్‌: అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో నెలకొన్న అతి పెద్ద హిందూ దేవాలయం ‘శ్రీ వెంకటేశ్వర ఆలయం’లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడ నిర్మించిన 87 అడుగుల భారీ గోపురాన్ని దీపావళి సందర్భంగా ఈ నెల 24న ఆవిష్కరించారు. ‘ఐక్యత, శ్రేయస్సుల గోపురం’ పేరుతో నిర్మించిన ఈ కట్టడాన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ గేరీ కూపర్‌ ప్రారంభించారు. ‘రాయల్‌ గేట్‌వే టు గాడ్‌’గా పిలుస్తున్న ఈ గోపురం నిర్మాణ పనులను 2020లో ప్రారంభించినట్లు ఆలయ ట్రస్టీల బోర్డు జనరల్‌ సెక్రటరీ లక్ష్మీనారాయణ శ్రీనివాసన్‌ తెలిపారు. ఈ గోపురం భగవంతుడి పాదాలకు ప్రతీక అని, భక్తులు ఈ గోపురం వద్ద దేవుడి ముందు తల వంచి తమ బాధలను విడిచి రాజ గోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారని ఆలయ ఛైర్మన్‌ రాజ్‌ తోటకూర పేర్కొన్నారు. దీని నిర్మాణం కోసం 5 వేల మందికి పైగా హిందువులు 25 లక్షల డాలర్ల విరాళాలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని