Imran Khan: మోదీ ఆస్తులపై.. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు.

Published : 23 Sep 2022 02:20 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. పాక్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నేత నవాజ్‌ షరీఫ్ అవినీతిని ఎండగడుతూ.. మన ప్రధాని ఆస్తుల ప్రస్తావన తెచ్చారు. నవాజ్‌ మాదిరిగా ప్రపంచంలో ఏ నేతకు విదేశాల్లో రూ. వందల కోట్ల విలువైన ఆస్తులు లేవని విరుచుకుపడ్డారు. 

‘ఒక దేశంలో చట్టబద్ధమైన పాలన లేకపోతే.. అక్కడికి విదేశీ పెట్టుబడులు రావు. అవినీతి రాజ్యమేలుతుంది. దేశం వెలుపల రూ. వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఒక్క ప్రపంచ నేత పేరు చెప్పండి. మన పొరుగు దేశంలో కూడా అలాంటి పరిస్థితి లేదు. భారత్‌ ప్రధాని మోదీకి తన దేశం ఆవల ఎన్ని ఆస్తులున్నాయి? విదేశాల్లో నవాజ్‌కు ఎంత ఆస్తి ఉందో ఎవరూ ఊహించలేరు’ అని పాకిస్థాన్ ముస్లిం లీగ్‌ నేతపై మండిపడ్డారు. 

ఇదిలా ఉంటే.. భారత్‌పై ఇమ్రాన్‌ ప్రశంసలు కురిపించడం ఇది మొదటిసారేం కాదు. పొరుగు దేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబిస్తోందని, అమెరికా ఒత్తిడి ఉన్నా.. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసిందని మెచ్చుకున్నారు. అలాగే ఇంకో సందర్భంలో మాట్లాడుతూ.. ఏ అగ్రరాజ్యం భారత విదేశాంగ విధానాన్ని శాసించలేదని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని