అమెరికాలో కాల్పులు.. మరో భారతీయుడి మృతి

అగ్రరాజ్యం అమెరికాలో ఆగంతుకుల కాల్పులకు తాజాగా మరో భారతీయుడు  బలయ్యాడు. జార్జియాలో నివాసం ఉంటున్న 52ఏళ్ల పినల్‌ పటేల్‌.. తన భార్య రుపల్‌బేన్‌ పటేల్‌, కుమార్తె భక్తీ పటేల్‌తో ఆట్రియమ్‌ ఆసుపత్రికి బయలుదేరాడు.

Updated : 26 Jan 2023 06:12 IST

52 ఏళ్ల వ్యక్తిపై ఆగంతుకుల దాడి..
ముగ్గురిని పొట్టనపెట్టుకున్న మరో దుండగుడు

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో ఆగంతుకుల కాల్పులకు తాజాగా మరో భారతీయుడు  బలయ్యాడు. జార్జియాలో నివాసం ఉంటున్న 52ఏళ్ల పినల్‌ పటేల్‌.. తన భార్య రుపల్‌బేన్‌ పటేల్‌, కుమార్తె భక్తీ పటేల్‌తో ఆట్రియమ్‌ ఆసుపత్రికి బయలుదేరాడు. దారి మధ్యలో ముగ్గురు దుండగులు వారిని అడ్డుకొని విచక్షణారహితంగా కాల్చి పరారయ్యారు. ఈ దాడిలో పినల్‌ పటేల్‌ మృతిచెందగా.. ఆయన భార్య, కుమార్తె గాయాలపాలయ్యారు. ఈ ఘటన జనవరి 20న జరిగింది. సోమవారం దీని వివరాలను పోలీసులు వెల్లడించారు. ఆదివారం సైతం అక్కడి దుండగులు 23ఏళ్ల భారత విద్యార్థిని కాల్చి చంపారు.

కాల్పులు జరిపి.. ఆత్మహత్య..

వాషింగ్టన్‌లోని యాకిమా ప్రాంతంలో ఉన్న ఓ కన్వీనియన్స్‌ స్టోర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఆగంతుకుడు ప్రవేశించి కొందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొంత మంది గాయాలపాలయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని