Flight: 13 గంటలు ప్రయాణించి టేకాఫ్ అయిన చోటే ల్యాండింగ్..

సుమారు 13 గంటలపాటు ప్రయాణించిన విమానం.. ఎక్కడి నుంచి టేకాఫ్‌ అయిందో, మళ్లీ అక్కడే దిగేసరికి ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

Updated : 01 Feb 2023 07:36 IST

సుమారు 13 గంటలపాటు ప్రయాణించిన విమానం.. ఎక్కడి నుంచి టేకాఫ్‌ అయిందో, మళ్లీ అక్కడే దిగేసరికి ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. దుబాయ్‌ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లాల్సిన ఎమిరేట్స్‌ విమానానికి ఈ అనుభవం ఎదురైంది. భారీ వరదల కారణంగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ విమానాశ్రయం నీటితో నిండిపోయి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దాదాపు సగం దూరం ప్రయాణించిన ఎమిరేట్స్‌ విమానం వెనుదిరగాల్సి వచ్చింది. దీనిపై ఆక్లాండ్‌ విమానాశ్రయ సిబ్బంది ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఈ పరిస్థితి తీవ్ర అసహనానికి గురిచేస్తుంది. కానీ, ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని