‘హిజాబ్‌’ అల్లర్ల కేసుల్లో ముగ్గురిని ఉరి తీసిన ఇరాన్‌

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతేడాది నిరసనలు చేపట్టి హింసాకాండకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను ఇరాన్‌ ప్రభుత్వం శుక్రవారం ఉరి తీసింది.

Published : 20 May 2023 05:25 IST

దుబాయ్‌: ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతేడాది నిరసనలు చేపట్టి హింసాకాండకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను ఇరాన్‌ ప్రభుత్వం శుక్రవారం ఉరి తీసింది. నిందితులు మజీద్‌ కాజెమీ, సలేహ్‌ మిర్హాషెమీ, సయీద్‌ యగౌబీలను ఉరి తీసినట్లు ప్రకటించిన ‘మిజాన్‌’ అనే జ్యుడిషియరీ వెబ్‌సైట్‌.. వారిని ఎలా తీసుకొచ్చారన్న వివరాలు వెల్లడించలేదు. గతేడాది నవంబరులో జరిగిన దేశవ్యాప్త ‘‘హిజాబ్‌’’ అల్లర్ల  సందర్భంగా వీరు ఓ పోలీసు అధికారితోపాటు పారామిలిటరీ గ్రూపునకు చెందిన ఇద్దరు సభ్యులను చంపినట్లు  అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ముగ్గురితో కలిపి హిజాబ్‌ అల్లర్లతో సంబంధం ఉన్న మొత్తం ఏడుగురిని ఇరాన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఉరి తీసినట్లయింది. ఇరాన్‌ ప్రభుత్వ తీరును పౌరహక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అరెస్టు చేసినవారిని తీవ్రంగా హింసిస్తున్న పోలీసులు వారి చేత నేరాన్ని బలవంతంగా ఒప్పిస్తూ ఉరి తీస్తున్నారని ఆరోపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు