అమెరికా నిఘా విమానానికి సమీపంలో చైనా యుద్ధ విమానం

దక్షిణ చైనా సముద్రం మీదుగా తమ నిఘా విమానానికి అత్యంత సమీపంలో చైనా యుద్ధ విమానం మంగళవారం దూకుడుగా ప్రయాణించిందని అమెరికా సైన్యం పేర్కొంది.

Published : 01 Jun 2023 04:37 IST

అమెరికా అభ్యంతరం..
విమానాల నిలిపివేతకు చైనా డిమాండ్‌

వాషింగ్టన్‌: దక్షిణ చైనా సముద్రం మీదుగా తమ నిఘా విమానానికి అత్యంత సమీపంలో చైనా యుద్ధ విమానం మంగళవారం దూకుడుగా ప్రయాణించిందని అమెరికా సైన్యం పేర్కొంది. చైనా యుద్ధ విమానం సమీపించిన నేపథ్యంలో తమ పైలట్‌ ఒక విధమైన ఆందోళనతో నడపాల్సి వచ్చిందని వెల్లడించింది. అంతర్జాతీయ గగనతలంలో గత శుక్రవారం సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ ఆర్‌సీ-135 నిఘా విమానం ముంగిట్లోకి చైనీస్‌ జే16 ఫైటర్‌ పైలట్‌ దూసుకొచ్చారని వివరించింది. అప్పుడే అయోమయం నెలకొందని తెలిపింది. ఈ ప్రాంతంలో తమ విమానాలు, నౌకలను చైనా సైన్యం ఐదేళ్ల నుంచి తరచూ అడ్డగిస్తోందని అమెరికన్‌ రక్షణ బృందాలు ఫిర్యాదు చేశాయి. స్వయంపాలిత తైవాన్‌కు తాము ఆయుధాలను విక్రయించడంపై చైనా అనవసరంగా అభ్యంతరం చెబుతుండటంతో పాటు దక్షిణ చైనా సముద్రంపై సార్వభౌమాధికారానికి ప్రయత్నిస్తోందని యూఎస్‌ పేర్కొంది. ఈ ఫిర్యాదులపై బుధవారం బీజింగ్‌ స్పందించింది. అలాంటి విమానాలను నిలిపేయాలని డిమాండ్‌ చేసింది. చైనా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు ఎప్పుడూ తీసుకుంటుందని తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు