స్మార్ట్‌ఫోన్‌లో దగ్గు విని వ్యాధి నిర్ధారణ

దగ్గులో తేడాలను స్మార్ట్‌ ఫోన్‌లో విని వ్యాధి స్థాయిని అంచనా వేసే విధానాన్ని స్పెయిన్‌ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొవిడ్‌ కారణంగా బార్సిలోనాలోని డెల్‌మార్‌ ఆసుపత్రిలో చేరిన 70 మంది రోగుల దగ్గును తొలి 24 గంటల్లోనే స్మార్ట్‌ఫోన్‌లో రికార్డు చేశారు.

Updated : 23 Sep 2023 05:43 IST

దిల్లీ: దగ్గులో తేడాలను స్మార్ట్‌ ఫోన్‌లో విని వ్యాధి స్థాయిని అంచనా వేసే విధానాన్ని స్పెయిన్‌ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొవిడ్‌ కారణంగా బార్సిలోనాలోని డెల్‌మార్‌ ఆసుపత్రిలో చేరిన 70 మంది రోగుల దగ్గును తొలి 24 గంటల్లోనే స్మార్ట్‌ఫోన్‌లో రికార్డు చేశారు. వాటి హెచ్చు తగ్గులను బట్టి వ్యాధి తీవ్రతను విశ్లేషించే విధానాన్ని, అల్గొరిథమ్స్‌ను రూపొందించారు. దీనివల్ల వ్యాధిని ఆరంభ దశలోనే కనిపెట్టడంతో పాటు దూర ప్రాంతాల్లోని రోగులకు రిమోట్‌ చికిత్స చేయడమూ సాధ్యపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ, వైద్య వసతులు లేని ప్రాంతాల్లోనూ దూరం నుంచి చికిత్సకు తోడ్పడే విధానమిది. దీన్ని ఇతర శ్వాసకోశ వ్యాధుల చికిత్సకూ ఉపయోగించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని