బెల్జియం ప్రధానికి మోదీ ఫోను

బెల్జియం ప్రధానమంత్రి అలెగ్జాండర్‌ డి క్రుతో ప్రధాని మోదీ మంగళవారం ఫోనులో సంభాషించారు. పశ్చిమాసియాతో పాటు రష్యా- ఉక్రెయిన్‌ వివాదంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు మద్దతు తదితర అంశాలపై ఇరు దేశాల నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం.

Published : 27 Mar 2024 04:13 IST

దిల్లీ: బెల్జియం ప్రధానమంత్రి అలెగ్జాండర్‌ డి క్రుతో ప్రధాని మోదీ మంగళవారం ఫోనులో సంభాషించారు. పశ్చిమాసియాతో పాటు రష్యా- ఉక్రెయిన్‌ వివాదంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు మద్దతు తదితర అంశాలపై ఇరు దేశాల నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మోదీ స్వయంగా తన ‘ఎక్స్‌’ ఖాతాలో వెల్లడించారు. బ్రస్సెల్స్‌లో తొలిసారిగా నిర్వహించిన అణుశక్తి సమావేశం విజయంపై అలెగ్జాండర్‌కు మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై సహకారం, భారత్‌-ఈయూ భాగస్వామ్య అభివృద్ధిపై మోదీ, అలెగ్జాండర్‌ చర్చించుకున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని