అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష

అధిక మోతాదులో ఇన్సులిన్‌ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది.

Updated : 05 May 2024 06:06 IST

17 మంది రోగుల హత్య కేసులో...

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అధిక మోతాదులో ఇన్సులిన్‌ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. 2020-2023 సంవత్సరాల్లో అయిదు ఆసుపత్రులు మారిన ఆమె.. 22 మందికి అధిక మోతాదులో ఇన్సులిన్‌ ఇచ్చి హత్యాయత్నానికి పాల్పడిందని, వీరిలో 17 మంది మరణించారని కోర్టు ధ్రువీకరించింది. దీంతో ఆమెకు 380 నుంచి 760 ఏళ్ల వరకు జైలు శిక్షను విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన హీథర్‌ ప్రెస్‌డీ(41) అధికంగా ఇన్సులిన్‌ ఇవ్వడం వల్లే ఇద్దరు రోగులు మరణించారంటూ గతేడాది మేలో ఓ ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తీగ లాగడంతో డొంకంతా కదిలింది. చుట్టూ ఉన్నవారన్నా, రోగులు అన్నా తనకు నచ్చరని.. వారికి హాని కలిగించాలని ఉందని ఆమె తన తల్లికి చేసే మెసేజ్‌లలో తరచుగా చెబుతుండేదని అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని