Covid Vaccine: మొక్కలతో కొవిడ్‌ వ్యాక్సిన్‌.. 5 వేరియంట్లకు చెక్‌!

మొక్కల ఆధారంగా తయారైన కొత్త కొవిడ్‌ వ్యాక్సిన్‌... అయిదు రకాల కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా సుమారు 70% సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు క్లినికల్‌ పరీక్షల్లో తేలింది.

Published : 07 May 2022 08:28 IST

టొరంటో: మొక్కల ఆధారంగా తయారైన కొత్త కొవిడ్‌ వ్యాక్సిన్‌... అయిదు రకాల కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా సుమారు 70% సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు క్లినికల్‌ పరీక్షల్లో తేలింది. కెనడాకు చెందిన మెడికాగో సంస్థ దీన్ని రూపొందించింది. ‘ఏఎస్‌వో3’ అనే పదార్థంతో... మొక్కల ఆధారంగా ఉత్పత్తిచేసిన కరోనా వైరస్‌ మాదిరి పార్టికల్స్‌ (సీవోవీఎల్‌పీ)ను అడ్డుకునేలా దీన్ని తయారు చేసింది. మూడోదశ క్లినికల్‌ పరీక్షల్లో భాగంగా 85 చోట్ల, మొత్తం 24,141 మందిపై దీన్ని పరీక్షించి చూశారు. 21 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇంజెక్షన్‌ రూపంలో వారికి దీన్ని అందించారు. పలు లక్షణాలకు కారణమయ్యే అయిదు రకాల వేరియంట్లకు వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్‌ 69.5% పనితీరు కనబరుస్తున్నట్టు గుర్తించారు. మధ్య-తీవ్ర స్థాయి ఇన్‌ఫెక్షన్‌ను ఇది 74-78.8% మేర అడ్డుకుంటున్నట్టు తేల్చారు. ఈ కొత్త ‘సీవోవీఎల్‌పీ+ఏఎస్‌03 వ్యాక్సిన్‌’ తీసుకున్న వారెవరూ తీవ్రస్థాయి కొవిడ్‌కు గురికాలేదని పరిశోధకులు తెలిపారు. ప్లాసిబో తీసుకున్నవారితో పోలిస్తే... ఈ టీకా పొందినవారిలో బ్రేక్‌త్రూ కేసులు చాలా తక్కువగా ఉంటున్నట్టు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని