కోపెన్‌హగెన్‌ మాల్‌లో కాల్పుల మోత

డెన్మార్క్‌ రాజధాని నగరం కోపెన్‌హగెన్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో ఆదివారం కాల్పుల మోత మోగింది. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మాల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలను

Published : 04 Jul 2022 05:09 IST

పలువురి మృతి!

కోపెన్‌హగెన్‌: డెన్మార్క్‌ రాజధాని నగరం కోపెన్‌హగెన్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో ఆదివారం కాల్పుల మోత మోగింది. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మాల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలను కాపాడుకునేందుకు జనం చెల్లాచెదురుగా పరుగులు తీశారు. పెద్దపెట్టున రోదిస్తూ సమీప దుకాణాల్లో దాక్కొనేందుకు ప్రయత్నించారు. సంఘటన స్థలంలో 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ‘పెద్దసంఖ్యలో జనం గాయపడ్డారు’ అని ట్వీట్‌ చేసిన పోలీసులు అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. పలువురు మరణించినట్లు పోలీసులు చెబుతున్నా సంఖ్యపై స్పష్టత లేదు. ‘ఎంతమంది చనిపోయారో.. ఎందరు గాయపడ్డారో కచ్చితంగా తెలియడం లేదు. భయానకమైన కాల్పులు జరిగినట్లు మాత్రం తెలుస్తోంది’ అని కోపెన్‌హగెన్‌ మేయర్‌ సోఫీ హెచ్‌.ఆండర్‌సన్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని