అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ కవాతుపై తూటా

అమెరికా స్వాతంత్య్ర దిన వేడుకల్లో నెత్తురు చిందింది. ఇలినాయీ రాష్ట్రంలోని షికాగో నగర శివారు ప్రాంతమైన హైలాండ్‌ పార్క్‌లో సోమవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. 24 మంది గాయపడ్డారు.

Updated : 05 Jul 2022 06:20 IST

ఆరుగురి మృతి, 24 మందికి గాయాలు
హాహాకారాలు చేస్తూ పరుగులు తీసిన ప్రజలు

షికాగో: అమెరికా స్వాతంత్య్ర దిన వేడుకల్లో నెత్తురు చిందింది. ఇలినాయీ రాష్ట్రంలోని షికాగో నగర శివారు ప్రాంతమైన హైలాండ్‌ పార్క్‌లో సోమవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. 24 మంది గాయపడ్డారు. స్థానికంగా స్వాతంత్య్ర దినోత్సవ కవాతు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే.. కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో కవాతును వీక్షించేందుకు, అందులో పాల్గొనేందుకు వచ్చిన వందల మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కవాతును లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు భవనం పైనుంచి కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని