Corona Virus: గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న కరోనా స్పైక్‌ ప్రొటీన్‌

తీవ్రస్థాయి కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరేవారి హృదయ ఆరోగ్యం ఎంతోకొంత దెబ్బతింటోంది. ఇలా ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నకు యుటికాలోని మసోనిక్‌ వైద్య పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. కరోనా వైరస్‌లోని స్పైక్‌

Updated : 28 Jul 2022 07:36 IST

న్యూయార్క్‌: తీవ్రస్థాయి కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరేవారి హృదయ ఆరోగ్యం ఎంతోకొంత దెబ్బతింటోంది. ఇలా ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నకు యుటికాలోని మసోనిక్‌ వైద్య పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ వీరి హృదయ కండరాలను గాయపరుస్తుందని, ఇందుకు అంతర్గతవాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్‌) దోహదపడుతోందని ప్రాథమికంగా గుర్తించారు. ‘‘వైరస్‌పై పోరాడటానికి శరీర రోగనిరోధక వ్యవస్థ స్పందించడం చాలా ముఖ్యం. అయితే, గుండె కండరాల్లోని కణాలు మాత్రం వాటి ప్రత్యేక ‘సహజ రోగనిరోధక వ్యవస్థ’ ద్వారా మహమ్మారిపై పోరాడతాయి. ఈ వ్యవస్థ క్రియాశీలకంగా మారితే హృదయ కండరాలు దెబ్బతిని, కణాలు మరణిస్తాయి. పర్యవసానంగా గుండె విఫలమయ్యే ప్రమాదమూ లేకపోలేదు. కొవిడ్‌-19కు కారణమయ్యే సార్స్‌-కొవ్‌-2 స్పైక్‌ ప్రొటీన్‌... ‘టీఎల్‌ఆర్‌4’ అనే సంకేతాల ద్వారా గుండె కండరాల సహజ రోగనిరోధక వ్యవస్థను చైతన్యపరుస్తున్నట్టు గుర్తించాం. అందుకే తీవ్రస్థాయి కొవిడ్‌ బాధితుల్లో హృదయ ఆరోగ్యం దెబ్బతింటున్నట్టు నిర్ధారణకు వచ్చాం’’ అని పరిశోధకులు వివరించారు. ఇందుకు సంబంధించిన నివేదికను ‘బేసిక్‌ కార్డియోవాస్కులర్‌ సైన్సెస్‌ సైంటిఫిక్‌ సెషన్స్‌-2022’లో సమర్పించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని