మ్యూజిక్‌ పబ్‌లో అగ్నిప్రమాదం

తూర్పు థాయిలాండ్‌లో శుక్రవారం రద్దీగా ఉన్న ఓ మ్యూజిక్‌ పబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో 14 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.

Published : 06 Aug 2022 04:32 IST

తూర్పు థాయిలాండ్‌లో 14 మంది మృతి
పలువురికి గాయాలు

బ్యాంకాక్‌: తూర్పు థాయిలాండ్‌లో శుక్రవారం రద్దీగా ఉన్న ఓ మ్యూజిక్‌ పబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో 14 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ తలుపు, ప్రవేశమార్గం నుంచి పెద్దఎత్తున నల్లని పొగ బయటకు వస్తుండగా, అదే మార్గం నుంచి ప్రజలు బయటకు పరుగులు తీయడం, ఈ క్రమంలో పలువురి వస్త్రాలకు మంటలు అంటుకోవడం కనిపించింది. రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల దూరంలో చొన్బురి ప్రావిన్స్‌లోని సత్తాషిప్‌ జిల్లాలో మౌంటెయిన్‌ బి పబ్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని, ఇందుకు కారణం తెలియాల్సి ఉందని పోలీసు అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారు జాము సమయానికి కొద్దిగా ముందుగా 12.45 గంటలకు పబ్‌లో అగ్నికీలలు చెలరేగాయని వివరించారు. తొలుత పబ్‌లోని వేదిక సమీపంలో మంటలు కనిపించాయని, అనంతరం భారీ పేలుడు సంభవించిందని పలువురు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని