అమెరికాలో అగ్రశ్రేణి కోర్టు జడ్జిగా రూపాలీ దేశాయ్‌!

అమెరికాలోని ఓ అగ్రశ్రేణి న్యాయస్థానం జడ్జిగా భారతీయ అమెరికన్‌ రూపాలీ హెచ్‌.దేశాయ్‌ పేరును సెనేట్‌ పచ్చజెండా ఊపింది. ఈమేరకు శాన్‌ఫ్రాన్సిస్కో (కాలిఫోర్నియా)లోని నైన్త్‌ సర్క్యూట్‌

Published : 07 Aug 2022 05:05 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని ఓ అగ్రశ్రేణి న్యాయస్థానం జడ్జిగా భారతీయ అమెరికన్‌ రూపాలీ హెచ్‌.దేశాయ్‌ పేరును సెనేట్‌ పచ్చజెండా ఊపింది. ఈమేరకు శాన్‌ఫ్రాన్సిస్కో (కాలిఫోర్నియా)లోని నైన్త్‌ సర్క్యూట్‌ ‘యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అపీల్స్‌’ న్యాయమూర్తిగా ఆమెను నియమించేందుకు సెనేట్‌ 67-29 ఓట్లతో ఆమోదం తెలిపింది. అమెరికాలోని 13 అపీల్‌ కోర్టుల్లోకెల్లా ఇది పెద్దది. ఆరిజోనాలోని అగ్రశ్రేణి ఎలక్షన్‌ లాయర్లలో రూపాలీ ఒకరు. నైన్త్‌ సర్క్యూట్‌ కోర్టుకు దక్షిణాసియాకు చెందిన తొలి జడ్జిగా ఆమె గుర్తింపు పొందనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని