రాజపక్స సోదరుల అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం పొడిగింపు

శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహింద రాజపక్స, ఆయన సోదరుడు మాజీ ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్స అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని వచ్చే నెల 5 వరకు దేశ సుప్రీంకోర్టు పొడిగించింది.

Published : 11 Aug 2022 05:25 IST

కొలంబో: శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహింద రాజపక్స, ఆయన సోదరుడు మాజీ ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్స అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని వచ్చే నెల 5 వరకు దేశ సుప్రీంకోర్టు పొడిగించింది. ప్రస్తుత శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి వీరే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. వీరు దేశం విడిచి వెళ్లకుండా గతంలోనే సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. వాటిని బుధవారం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని