శ్రీలంకలో ముగిసిన రాజపక్స వ్యతిరేక ఆందోళన

ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి కారణమైన రాజపక్స కుటుంబ పాలనకు చరమగీతం పాడే లక్ష్యంతో శ్రీలంకలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఎట్టకేలకు ముగిసింది. కొలంబోలోని గల్లే ఫేస్‌లో 123 రోజుల పాటు కొనసాగిన దీక్షా శిబిరాన్ని

Published : 11 Aug 2022 05:38 IST

123 రోజుల తర్వాత శిబిరాన్ని వీడిన ఉద్యమకారులు

కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి కారణమైన రాజపక్స కుటుంబ పాలనకు చరమగీతం పాడే లక్ష్యంతో శ్రీలంకలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఎట్టకేలకు ముగిసింది. కొలంబోలోని గల్లే ఫేస్‌లో 123 రోజుల పాటు కొనసాగిన దీక్షా శిబిరాన్ని ఉద్యమకారులు మంగళవారం ఖాళీ చేశారు. ్ఞగొటబాయ గో హోమ్ఠ్‌ నినాదంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఉద్యమకారులు నిరసన దీక్షను అక్కడ ప్రారంభించారు. ప్రజాందోళనలు వెల్లువెత్తడంతో తొలుత ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయడం, ఆ తర్వాత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడి పరారు కావడం తెలిసిందే. రణిల్‌ విక్రమసింఘే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆందోళనకారులపై నిర్బంధం పెరిగింది. ఈ నేపథ్యంలో సమష్టి నిర్ణయంలో భాగంగానే శిబిరం నుంచి వెళ్లిపోతున్నట్లు నిరసనకారుల అధికార ప్రతినిధి మనోజ్‌ ననయాక్కర తెలిపారు. దీక్షా శిబిరాన్ని తొలగిస్తున్నప్పటికీ వ్యవస్థలో మార్పు కోసం ఉద్యమిస్తూనే ఉంటామని నిరసనకారుడు విదర్శన కన్నన్‌గర వెల్లడించారు. అధ్యక్ష తరహా వ్యవస్థకు ముగింపు పలికి పార్లమెంటుకు తాజాగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు యువ సాధువు కొస్వాట్టె మహనామా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని