కొవిడ్‌ సమయంలో కిమ్‌కు తీవ్ర జ్వరం!

ఉత్తర కొరియాలో ఇటీవల కొవిడ్‌ విజృంభించిన సమయంలో అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ‘తీవ్ర జ్వరం’ బారినపడినట్లు ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ వెల్లడించారు. అధినేత ఆరోగ్యంపై ఆ దేశం ఎప్పుడూ గుంభనంగా వ్యవహరిస్తుంటుంది. అయితే

Published : 12 Aug 2022 06:36 IST

ఆయన సోదరి ప్రకటన

సియోల్‌: ఉత్తర కొరియాలో ఇటీవల కొవిడ్‌ విజృంభించిన సమయంలో అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ‘తీవ్ర జ్వరం’ బారినపడినట్లు ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ వెల్లడించారు. అధినేత ఆరోగ్యంపై ఆ దేశం ఎప్పుడూ గుంభనంగా వ్యవహరిస్తుంటుంది. అయితే అసాధారణ రీతిలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం. అంత జ్వరంలోనూ ప్రజల పట్ల ఆందోళనతో అధినేత ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదని ఆమె తన ప్రసంగంలో వణికిన స్వరంతో చెప్పారు. ఇది చూస్తున్న ప్రేక్షకులు కంటతడి పెట్టుకున్న దృశ్యాలు అధికారిక టీవీలో ప్రసారమయ్యాయి. అయితే ఆయన ఎప్పుడు అనారోగ్యానికి గురైందీ ఆమె వెల్లడించలేదు. తమ దేశంలో వైరస్‌ వ్యాప్తికి దక్షిణ కొరియా కారణమని కిమ్‌ సోదరి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆ దేశాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ద.కొరియా ‘కీలుబొమ్మలైన’ కొందరు సరిహద్దుల గుండా బెలూన్ల ద్వారా కరపత్రాలను, మలిన పదార్థాలను పంపిస్తుండటం వల్లే తమ దేశంలో వైరస్‌ వ్యాప్తి చెందిందని ఆమె ఆరోపించినట్లు కొరియన్‌ అధికారిక మీడియా గురువారం తెలిపింది. ఇదిలా ఉండగా ఉత్తర కొరియాలో వైరస్‌పై తాము గెలిచామని అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బుధవారం ప్రకటించుకున్నారు. ‘గొప్ప క్వారంటైన్‌ యుద్ధం’లో ‘జ్వరాల’పై విజయం సాధించామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని