Imran Khan: భారత్‌ను మళ్లీ ప్రశంసించిన ఇమ్రాన్‌

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌ను మరోసారి కొనియాడారు. ఏ దేశం ఒత్తిడికీ లొంగకుండా భారత విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉందని

Updated : 15 Aug 2022 08:18 IST

లాహోర్‌ సభలో కేంద్ర మంత్రి జైశంకర్‌ వీడియో ప్రదర్శన

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌ను మరోసారి కొనియాడారు. ఏ దేశం ఒత్తిడికీ లొంగకుండా భారత విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉందని మెచ్చుకున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాట్లాడిన వీడియోను ఆయన బహిరంగ సభలో ప్రదర్శించారు. అమెరికా ఒత్తిడి ఉన్నా రష్యా నుంచి తక్కువ ధరకు భారత్‌ చమురు కొనుగోలు చేసిందని ప్రశంసించారు. లాహోర్‌ జాతీయ హాకీ స్టేడియంలో శనివారం అర్ధరాత్రి కిక్కిరిసిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్‌, పాకిస్థాన్‌ ఒకేసారి స్వాతంత్య్రం పొందాయని, విదేశాంగ విధానం విషయంలో భారత్‌ ప్రజానుకూల నిర్ణయాలను తీసుకుంటోందని ఇమ్రాన్‌ చెప్పారు. ఐరోపా దేశాలు రష్యా నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నాయని, భారత ప్రజల కోసం తామూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని జైశంకర్‌ ప్రశ్నించిన వీడియోను ఇమ్రాన్‌ ప్రదర్శించారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిడికి లొంగిపోతోందని విమర్శించారు. 2023 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేలా పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను లండన్‌ నుంచి వెనక్కు రప్పించేందుకు వీలుగా ఆయనపై ఉన్న జీవితకాల అనర్హత వేటును తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని