ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పోరుకు సరికొత్త అస్త్రం

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ సహా దానికి సంబంధించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొనే బైవ్యాలెంట్‌ టీకాకు ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌ ఆమోదం తెలిపింది. మోడెర్నా కంపెనీ తయారుచేసిన ఈ బూస్టర్‌ టీకాను స్పైక్‌

Published : 16 Aug 2022 05:48 IST

బైవ్యాలెంట్‌ టీకాకు ఆమోదం తెలిపిన బ్రిటన్‌

లండన్‌: కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ సహా దానికి సంబంధించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొనే బైవ్యాలెంట్‌ టీకాకు ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌ ఆమోదం తెలిపింది. మోడెర్నా కంపెనీ తయారుచేసిన ఈ బూస్టర్‌ టీకాను స్పైక్‌ వ్యాక్స్‌ బైవ్యాలెంట్‌ ఒరిజినల్‌/ఒమిక్రాన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బూస్టర్‌ డోసులో సగం (25 మైక్రోగ్రాములు) 2020నాటి అసలైన వైరస్‌పై పనిచేస్తే, మిగతా సగం (25 మైక్రోగ్రాములు) ఒమిక్రాన్‌ వేరియంట్లు బీఏ 1, బీఏ 4, బీఏ 5లను నిరోధిస్తుందని బ్రిటిష్‌ ఔషధ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎం.హెచ్‌.ఆర్‌.ఏ) వివరించింది. టీకాలను తప్పించుకోవడానికి నిరంతరం పరిణామం చెందుతున్న సార్స్‌ కోవ్‌ 2 వైరస్‌పై పోరుకు బైవ్యాలెంట్‌ టీకా శక్తిమంతమైన అస్త్రమని బ్రిటిష్‌ మానవ ఔషధ కమిషన్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ మునీర్‌ పీర్‌ మహమ్మద్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని