అమెరికాలో మంకీపాక్స్‌తో సహజీవనం తప్పదు

అమెరికాలో మంకీపాక్స్‌ను పూర్తిగా అంతమొందించడం సాధ్యం కాదని సీడీసీ (సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) ప్రకటించింది. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి నెమ్మదించినా... ఇప్పటికే

Updated : 02 Oct 2022 07:23 IST

ఆరోగ్య శాఖ అధికారుల ప్రకటన

న్యూయార్క్‌: అమెరికాలో మంకీపాక్స్‌ను పూర్తిగా అంతమొందించడం సాధ్యం కాదని సీడీసీ (సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) ప్రకటించింది. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి నెమ్మదించినా... ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధికంగా విస్తరించిన వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని తన నివేదికలో పేర్కొంది. సీడీసీలోని వ్యాధుల విభాగం డైరెక్టర్‌ మార్క్‌ లిసిచ్‌ మాట్లాడుతూ.. ‘‘మంకీపాక్స్‌ శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది. భవిష్యత్తు తరాలను నిరంతరం భయపెడుతూనే ఉంటుంది. స్వలింగ సంపర్కులు, బైసెక్సువల్‌ పురుషుల మధ్య ఇది అత్యధికంగా విస్తరిస్తున్నా.. వ్యాధి ఎవరికైనా సోకే ప్రమాదముంది. ముప్పు ఉన్న వారు నివారణ చర్యలు తీసుకుంటూనే, టీకాలు వేయించుకోవాలి. దేశంలో ప్రస్తుతం రోజువారీ కేసులు 150 దిగువకు చేరుకున్నాయి’’ అని వివరించారు. ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో మంకీపాక్స్‌ ఎండమిక్‌ దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ మంకీపాక్స్‌ను చూడని దేశాల్లోనూ 67 వేల కేసులు బయటపడ్డాయి. వాటిలో ఒక్క అమెరికాలోనే 25,600 కేసులు ఉన్నాయి. ఒకరు చనిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని