ఢీకొట్టి చిక్కుకుని.. విద్యుత్తు టవర్‌లో విమానం..

అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రం మాంట్‌గోమరీ కౌంటీలో చిన్నపాటి విమానం ఒకటి విద్యుత్తు టవర్‌ను ఢీకొట్టింది.

Updated : 29 Nov 2022 07:40 IST

గెయిథ్రస్‌బర్గ్‌: అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రం మాంట్‌గోమరీ కౌంటీలో చిన్నపాటి విమానం ఒకటి విద్యుత్తు టవర్‌ను ఢీకొట్టింది. అనంతరం భూమికి 30 మీటర్ల ఎత్తులో తీగల్లో చిక్కుకుపోయింది. ఆదివారం సాయంత్రం 5.40 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటుచేసుకోగా.. అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి 12.36 గంటలకు విమానంలో మొదటి వ్యక్తిని రక్షించగలిగారు. అనంతరం మరో 11 నిమిషాలకు రెండో వ్యక్తిని కాపాడారు. విమానంలో నుంచి రక్షించిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని, ప్రాణాపాయం మాత్రం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఈ సింగిల్‌ ఇంజిన్‌ విమానం న్యూయార్క్‌ నుంచి బయల్దేరిందని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) తెలిపింది. మాంట్‌గోమరీ కౌంటీలో 1.20 లక్షల మంది వినియోగదారులకు ఈ ప్రమాదం కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని