పుట్టబోయే పిల్లలకు క్యాన్సర్‌ రాకూడదంటే..!

కీమోథెరపీ చేయించుకున్న తర్వాత క్యాన్సర్‌ బాధితులకు పుట్టే పిల్లలు, మనవలు, మునిమనవలు కూడా... ఆ వ్యాధి బారినపడే ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తాజా పరిశోధనలో తేలింది.

Published : 30 Nov 2022 03:54 IST

కీమోథెరపీకి ముందే జాగ్రత్త పడాలి

వాషింగ్టన్‌: కీమోథెరపీ చేయించుకున్న తర్వాత క్యాన్సర్‌ బాధితులకు పుట్టే పిల్లలు, మనవలు, మునిమనవలు కూడా... ఆ వ్యాధి బారినపడే ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు. యవ్వనంలో ఉన్న కొన్ని ఎలుకలకు క్యాన్సర్‌ చికిత్సలో వాడే ‘ఐఫోస్పామైడ్‌’ ఔషధాన్ని ఇచ్చారు. తర్వాత వాటికి పుట్టిన సంతానంలోనూ, మూడోతరం ఎలుకల్లోనూ క్యాన్సర్‌ ముప్పు అధికంగా ఉండటం ఆశ్చర్యపరిచింది. కీమోథెరపీలో వినియోగించే ఔషధాలు... శరీరంలోని వివిధ అవయవాలతో పాటు పునరుత్పత్తిపైనా ప్రభావం చూపుతుండటమే ఇందుకు కారణమని పరిశోధనకర్త మైకేల్‌ స్కిన్నెర్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో పిల్లలను కనాలనుకునే క్యాన్సర్‌ రోగులు... కీమోథెరపీ చేయించుకోవడానికి ముందే తమ శుక్రకణాలు లేదా అండాలను క్రయో ప్రిజర్వేషన్‌ విధానాల్లో భద్రపరచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో వాటి ద్వారా పుట్టే పిల్లలకు క్యాన్సర్‌ ముప్పు ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని