తీవ్రస్థాయి కొవిడ్‌తో పేగుల్లో బ్యాక్టీరియా అసమతుల్యత

పేగుల్లోని మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య ఉండే ఆరోగ్యకర సమతుల్యతను తీవ్రస్థాయి కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ దెబ్బతీస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Published : 30 Nov 2022 03:54 IST

వాషింగ్టన్‌: పేగుల్లోని మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య ఉండే ఆరోగ్యకర సమతుల్యతను తీవ్రస్థాయి కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ దెబ్బతీస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా యాంటీబయోటిక్స్‌ చికిత్స పొందేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. కొవిడ్‌ ఉద్ధృతి వేళ చాలామంది బాధితులను గ్యాస్‌ సమస్యలు వేధించాయి. దీనిపై దృష్టి సారించిన రట్జర్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు... ఆరోగ్యవంతులు, కొవిడ్‌ బాధితుల పేగుల్లోని బ్యాక్టీరియాను విశ్లేషించారు. ఇన్‌ఫెక్షన్‌, యాంటీబయోటిక్స్‌ కారణంగా పేగుల్లోని సూక్ష్మజీవుల మధ్య సమతుల్యత దెబ్బతింటోందని, దీన్ని అధిగమించేలా ప్రోబయోటిక్‌ సప్లిమెంట్లను అభివృద్ధి చేసేందుకు తమ పరిశోధన దోహదపడుతుందని పరిశోధనకర్త మార్టిన్‌ బ్లాసెర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని