Ukraine: రష్యాలో జిన్‌పింగ్.. ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమైన జపాన్ ప్రధాని
చైనా అధినేత షీ జిన్‌పింగ్ రష్యా పర్యటన వేళ.. జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా(Fumio Kishida) ఉక్రెయిన్(Ukraine)లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. చైనా(China) అధినేత షీ జిన్‌పింగ్(Xi Jinping) రష్యా(Russia)లో పర్యటిస్తోన్న వేళ.. కిషిదా కీవ్‌లో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ పర్యటనలో ఉన్న కిషిదా ఇక్కడినుంచి నేరుగా ఉక్రెయిన్‌కు చేరుకున్నారు. రష్యా సైనిక చర్య కొనసాగుతోన్న తరుణంలో కిషిదా ఉక్రెయిన్ పర్యటన.. ఆ దేశానికి సంఘీభావంతోపాటు ఇరుదేశాల మధ్య బలమైన సహకారానికి సంకేతంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కిషిదా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను జపాన్ ఖండిస్తోన్న విషయం తెలిసిందే.
రష్యాలో జిన్‌పింగ్ రెండో రోజు..
మాస్కో పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. రెండో రోజు మంగళవారం రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్‌తో సమావేశమయ్యారు. రష్యాతో వ్యూహాత్మక సంబంధాలకు తమ దేశం ప్రాధాన్యం ఇస్తుందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. మరోవైపు.. పుతిన్‌ను ఈ ఏడాది చివర్లో చైనాలో పర్యటించాల్సిందిగా జిన్‌పింగ్ ఆహ్వానించినట్లు సమాచారం. అంతకుముందు.. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో చైనా ‘శాంతి ప్రతిపాదన’పై రష్యా అధినేత పుతిన్, జిన్‌పింగ్‌లు సుదీర్ఘ చర్చ చేపట్టినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతిధిని పెస్కొవ్ వెల్లడించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ జిన్‌పింగ్ టెలిఫోన్ సంభాషణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)