Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు

Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.

Published : 29 Apr 2024 13:23 IST

టొరంటో: కెనడా (Canada) ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) ప్రసంగిస్తుండగా.. కొందరు ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేశారు. ‘ఖల్సా’ దినోత్సవాల్లో ఈ పరిణామం చోటుచేసుకోవడం కలకలం రేపింది. టొరంటోలో ఆదివారం ఖల్సా డే పరేడ్‌ నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని ట్రూడోతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రధాని మాట్లాడుతుండగా వారు ‘ఖలిస్థానీ జిందాబాద్‌’ అని అరుస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ట్రూడో వారిని పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘సిక్కుల హక్కులు, స్వేచ్ఛను మేం ఎల్లప్పుడూ రక్షిస్తాం. మీరు స్వదేశంలోని మీ కుటుంబసభ్యులను చూసేందుకు వీలుగా భారత్‌, కెనడా మధ్య విమాన రాకపోకలను మరింత పెంచేందుకు కృషి చేస్తాం’’ అని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు.

అతడి హత్యకు పుతిన్‌ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ గతేడాది ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. దీనిపై కెనడా దర్యాప్తు చేపట్టగా.. ఈ ఆరోపణలను దిల్లీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే ఇటీవల అట్టావాలోని భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మను లక్ష్యంగా చేసుకుని కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు.. భారత వ్యతిరేక నినాదాలు చేయడం కలకలం రేపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని