Canada: ‘చరిత్రను మరచిపోవడం అత్యంత దారుణం’.. కెనడాపై మండిపడ్డ రష్యా

హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ సైనికుడిని కెనడా పార్లమెంట్‌ సత్కరించడంపై రష్యా మండిపడింది.

Published : 26 Sep 2023 02:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ సైనికుడిని కెనడా పార్లమెంట్‌ సత్కరించడాన్ని రష్యా తీవ్రంగా పరిగణించింది. కెనడా చర్య అత్యంత దారుణమని పేర్కొంది. ఈ వ్యవహారం.. చారిత్రక సత్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని రుజువు చేస్తోందని, నాజీల నేరాలను గుర్తుంచుకోవాలని సూచించింది.

‘అటువంటి జ్ఞాపకాల పట్ల అలసత్వం వహించడం అత్యంత దారుణం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏ దేశంపై ఎవరు దాడి చేశారు? ఎవరిపై ఎవరు పోరాడారనే విషయం తెలియని యువతరాన్ని కెనడా సహా పాశ్చాత్య దేశాలు పెంచాయి. నియంతృత్వ ముప్పుపై వారికేమీ తెలియదు’ అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు.

Khalistani ఉగ్ర కుట్రలు.. మాస్టర్‌ మైండ్‌ ‘పన్నూ’..!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల కెనడాలో పర్యటించిన సందర్భంగా అక్కడి పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమానికి ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చిన, రెండో ప్రపంచ యుద్ధ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్‌ హంకాను స్పీకర్‌ ఆంటోనీ రోటా ఆహ్వానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడు అంటూ స్పీకర్‌ కీర్తించడంతో.. అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్‌ ట్రూడో, జలెన్‌స్కీ సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడి అతడిని అభినందించారు. దీనిపై వివాదం చెలరేగడంతో.. పొరపాటు జరిగిందంటూ స్పీకర్‌ క్షమాపణలు చెప్పారు. తాజాగా ఇదే విషయంపై రష్యా మండిపడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని