
McDonald’s: చివరగా బర్గర్ రుచి చూసేందుకు.. బారులు తీరుతున్న రష్యన్లు..!
మాస్కో: ‘ఆహారాన్ని అందుబాటులో ఉంచడం, వేల సంఖ్యలో సాధారణ పౌరులకు ఉపాధిని కొనసాగించడం కచ్చితంగా సరైన పని అని కొందరు వాదించొచ్చు. కానీ, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని విస్మరించడం అసాధ్యం. అందుకే రష్యాలో వ్యాపారాన్ని కొనసాగించడం ఇక ఏ మాత్రం సమర్థనీయం కాదు. అది మెక్‌డొనాల్డ్స్ విలువలకు ఏ మాత్రం సరిపోదు’ అంటూ అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ ప్రెసిడెంట్ రష్యాలోని తన సిబ్బందికి ఇటీవల లేఖ పంపారు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరిలో రష్యా యుద్ధం ప్రకటించాక, రష్యా నుంచి బయటకి వచ్చేస్తున్న మరో దిగ్గజ కంపెనీ ఇది. ఆ దేశంలో తన వ్యాపారాన్ని విక్రయించే ప్రక్రియను ప్రారంభించింది. సోవియట్ యూనియన్‌లో తొలి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌గా అడుగుపెట్టిన మూడు దశాబ్దాల తర్వాత.. ఈ సంస్థ ఆ దేశాన్ని వీడటం బర్గర్ ప్రేమికులను తీవ్రంగా బాధిస్తోంది. మెక్‌డొనాల్డ్స్ రుచులు మళ్లీ ఎప్పుడు చూస్తామోననుకుంటూ.. అక్కడక్కడా తెరిచి ఉన్న రెస్టారెంట్ల వద్ద జనాలు క్యూ కట్టారు.
మాస్కోలోని లెనిన్ గ్రాడ్‌స్కీ రైల్వే స్టేషన్ వద్ద తెరిచి ఉన్న మెక్‌డొనాల్డ్స్ బ్రాంచ్ ముందు పెద్ద సంఖ్యలో రష్యన్లు క్యూ కట్టారు. ‘మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్లు కొన్ని చోట్ల మాత్రమే తెరిచి ఉన్నాయి. నేను ఈ ఫుడ్‌ను మిస్ అవుతాను. అందుకే బిగ్ మ్యాక్‌తో సెలబ్రేట్ చేసుకుంటాను’ అంటూ 32 ఏళ్ల ఇరినా వెల్లడించారు. ‘త్వరలో మెక్‌డొనాల్డ్స్‌ను మూసివేస్తారని నిన్న చదివాను. కొత్త పేరుతో దానిని ప్రారంభిస్తారని తెలిసింది. అందుకే నా ఫేవరెట్ చీజ్ బర్గర్, మిల్క్ షేక్, చిప్స్ తీసుకునేందుకు వెంటనే ఇక్కడికి వచ్చేశాను. సంస్థ చేతులు మారిన తర్వాత నాణ్యత ఎలా ఉటుందో ఏమో..?’ అంటూ 21 ఏళ్ల అల్లా ఫీల్ అయ్యారు. అలాగే సైబీరియా ప్రాంతంలో కొన్ని ప్రాంఛైజీ తరహా అవుట్‌లెట్లు తెరిచి ఉన్నాయి. ఆ విషయం తెలుసుకున్న సమారా ప్రాంతానికి చెందిన వ్యక్తి.. తన నోటికి బర్గర్ రుచి చూపించేందుకు రెండున్నర గంటల పాటు 250 కిలోమీటర్లు ప్రయాణించారు. రానున్న రోజుల్లో రష్యన్లు ఈ ఫుడ్‌ను ఎంతగా మిస్ అవుతారో ఈ ఉదాహరణలు బట్టే తెలుస్తోంది. అందుబాటు ధరలో, అనుకున్న వెంటనే తినే వీలున్న ఈ రెడీమెడ్ ఆహారం కొద్ది సంవత్సరాలుగా రష్యన్లకు బాగా దగ్గరైపోయింది.
1990లో సోవియట్ యూనియన్‌లో తొలి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌గా ఈ సంస్థ అడుగుపెట్టింది. సెంట్రల్ మాస్కోలో పుష్కిన్ స్క్వేర్ వద్ద మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ప్రారంభం రోజునే రికార్డులు బద్దలు కొట్టింది. మూడు రూబుళ్లలో లభించే బిగ్ మ్యాక్ కోసం 30 వేల మంది అక్కడ గుమిగూడారు. అప్పటి నుంచి రెస్టారెంట్లు, ప్రాంచైజీ రెస్టారెంట్ల రూపంలో దేశవ్యాప్తంగా విస్తరించింది. 30 సంవత్సరాల తర్వాత ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా.. ఇప్పుడు 850 రెస్టారెంట్ల(84 శాతం వాటా)ను స్థానిక వ్యక్తులకు అమ్మేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ సమయంలో ప్రాంఛైజీల భవిష్యత్తు మాత్రం అస్పష్టంగా ఉంది. అలాగే కొత్త యజమానులు సంస్థ పేరు, లోగో, బ్రాండింగ్, మెనూను వాడేందుకు అనుమతి లేదు. అయితే మెక్‌డొనాల్డ్స్ రష్యాలో తిరిగి వచ్చే అవకాశాలను మాత్రం కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. తమ సిబ్బందిని రష్యా కొనుగోలుదారు నియమించుకోవాల్సి ఉంటుందని.. విక్రయం పూర్తయ్యేవరకు వారికి జీతాలు ఇవ్వాల్సి ఉంటుందని సోమవారం సంస్థ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Flipkart MoU: సెర్ప్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం.. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో సంతకాలు
-
Politics News
Maharashtra: బాలాసాహెబ్, శివసేన పేర్లు ఇతరులు వాడొద్దు.. ఈసీని ఆశ్రయించిన ఉద్ధవ్ వర్గం..!
-
General News
Telangana News: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు
-
Politics News
BJP: కేసీఆర్ పాలనపై ‘సాలు దొర.. సెలవు దొర’ వెబ్సైట్ ప్రారంభిస్తున్నాం: తరుణ్ చుగ్
-
Business News
Bharat NCAP: మన కార్లకు స్టార్ రేటింగ్ ఎప్పటి నుంచంటే..?
-
Sports News
టెస్టుల్లో 100 సిక్సర్లు..అరుదైన క్లబ్లో బెన్ స్టోక్స్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు