Ukraine Crisis: డాన్‌బాస్‌ను తూట్లు పొడుస్తోన్న రష్యా శతఘ్నులు

ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతాన్ని రష్యా శతఘ్నులు తూట్లు పొడుస్తున్నాయి. తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. క్రెమ్లిన్‌ ముఖ్యంగా సివీరోడొనెట్స్క్‌ ప్రాంతంపై దృష్టిపెట్టింది.

Published : 08 Jun 2022 13:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతాన్ని రష్యా శతఘ్నులు తూట్లు పొడుస్తున్నాయి. తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. క్రెమ్లిన్‌ ముఖ్యంగా సివీరోదొనెట్స్క్‌ ప్రాంతంపై దృష్టిపెట్టింది.  తాజాగా గత 24 గంటల్లో మాక్సర్‌ సంస్థ సమీకరించిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. శతఘ్ని గుండ్ల వర్షానికి ధ్వంసమైపోయిన భవనాలు, తూట్లు పడిన పొలాలు ఈ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.

సివీరోదొనెట్స్క్‌  ప్రాంతం పూర్తిగా పారిశ్రామిక నగరం. ఈ నగరాన్ని దక్కించుకొంటే దొనెట్స్క్‌లో కీలక నగరమైన క్రమటోర్క్స్‌కు చేరుకోవడానికి రష్యాకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే 70శాతం సివీరోదొనెట్స్క్‌  రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఈ నగరానికి 20 నిమిషాల ప్రయాణ దూరంలోని రుబిజ్నే కూడా రష్యా శతఘ్నుల దెబ్బకు ధ్వంసమవుతోంది. మరోపక్క రష్యా మల్టిపుల్‌ రాకెట్‌ లాంఛర్లను కూడా ఈ దాడలుకు వాడుతోంది. సివీరోదొనెట్స్క్‌లోని మైదాన ప్రాంతాల్లో ఈ లాంఛర్లను రష్యా మోహరించినట్లు తెలుస్తోంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని