- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Julian Assange: అసాంజే అప్పగింతపై అమెరికాకు అనుకూలంగా తీర్పు
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేలా యూకే కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు ఈ అప్పగింతకు సంబంధించిన నిర్ణయం బ్రిటన్ హోం మంత్రి ప్రీతిపటేల్ చేతిలో ఉంది. మంత్రి తీర్పునకు అనుకూలంగా వ్యవహరిస్తే.. అసాంజే తరఫు న్యాయవాదులు 14 రోజుల వ్యవధిలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. తాజా తీర్పుతో యూకే కోర్టుల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న అతడి అప్పగింత కేసు చివరిదశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ కేసులో అప్పీళ్లకు అవకాశాలు ఉన్నాయి.
పదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని, వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదిస్తోంది. వాటిలో ఆయనకు గరిష్ఠంగా 175 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. అయితే అమెరికా వాదనను అసాంజే తరఫు న్యాయవాదులు ఖండిస్తున్నారు. ఒక ప్రజావేగుగా అసాంజే అమెరికా సైన్యం ఇరాక్, అఫ్గానిస్థాన్‌లో చేస్తున్న దారుణాలను బయటపెట్టారని, భావప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా ఆయనకు ఆ అధికారం ఉందని చెబుతున్నారు. ఈ గూఢచర్యం కేసుకు సంబంధించి.. అతడిని తన దేశానికి రప్పించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా ఇదివరకు చేసుకున్న అప్పీల్ తిరస్కరణకు గురైంది. అత్యంత గరిష్ఠ భద్రత కలిగిన యూఎస్ జైల్లో ఉంచడం వల్ల ఆత్మహత్యకు పాల్పడే ముప్పు ఉందని వాదించి, కోర్టు నుంచి అసాంజే ఉపశమనం పొందారు. కానీ అమెరికా తన ప్రయత్నాలు కొనసాగించి అనుకూలంగా తీర్పు పొందింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
-
World News
Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
Sports News
Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
-
Politics News
Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Social Look: పారిస్ ప్రేమలో మెహరీన్.. ట్రెండ్ ఫాలో అయిన ప్రియా ప్రకాశ్!
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!
- Brahmaji: అందుకే మేము పిల్లలు వద్దనుకున్నాం: బ్రహ్మాజీ