తెరాస, ఈటల వర్గీయుల ఘర్షణ
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెరాస, ఈటల వర్గీయుల ఘర్షణ

వీణవంక, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల, తెరాస మధ్య రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. శనివారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మార్కెట్‌ ఛైర్మన్‌ బాలకిషన్‌రావ్‌ ఆధ్వర్యంలో కొందరు ప్రజాప్రతినిధులు వీణవంక బస్టాండు ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ ఉండగా ఇంత మందితో సమావేశం ఎలా పెడతారని.. ఈటల వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ, వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి వారిని స్టేషన్‌కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది.
ఈటలతో కొండా దంపతుల భేటీ  
ఈనాడు, హైదరాబాద్‌: వివిధ పార్టీల నేతలతో వరసగా సమావేశమవుతున్న ఈటల రాజేందర్‌ ఆదివారం మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకులు కొండా సురేఖ, మురళి దంపతులతో భేటీ అయ్యారు. ఉదయం పది గంటల సమయంలో ఈటల నివాసానికి చేరుకున్న కొండా దంపతులు కొద్ది సేపు ఆయనతో ప్రత్యేకంగా తాజా అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ పరిణామం కాంగ్రెస్‌లోనూ చర్చకు దారితీసింది. ఒకట్రెండు రోజుల్లో కరీంనగర్‌ జిల్లాలోనే సీనియర్‌గా పేరున్న ఓ నేతతో ఈటల భేటీ కానున్నారని సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని